పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/224

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండకు బయలుదేరాడు. దారిలో బుడతడు "నానా! మనం నిప్పూ కట్టెలూ తీసుకొని వెళూన్నాం గాని బలి ఈయడానికి గొర్రెపిల్ల యేదీ?" అని అడిగాడు. ఆ మాటలకు ఆ తండ్రి గుండెలు తరుగుకొనిపోయి వుండాలి. సరే, అబ్రాహాము కొండమీద కట్టెలు పేర్చి కుమారుణ్ణి బంధించి బలిగా సమర్పించడానికి సిద్ధమయ్యాడు. ఆ భక్తుడు కత్తి పైకెత్తగానే దేవదూత అతని చేయిపట్టుకొని "ఓయి! చిన్నవానిని చంపద్దు. నీవు నీ యేకైక కుమారుడ్డి నాకు బలియిూయడానికి వెనుకాడలేదు. దీనిని బట్టి నీవు దైవభీతి కలవాడవని రుజువయింది" - అన్నాడు - ఆది 22. ఈ యబ్రాహాము ఎంత చిత్తశుద్ధి కలవాడై యుండాలి !

క్రైస్తవ భక్తునికి అత్యవసరంగా కావలసింది ఈ భగద్భక్తే హృదయాన్ని ప్రభువుకి అర్పించుకొని అతన్ని నమ్మి జీవించేవాడు మహానుభావుడు గదా! ఆ ప్రభువే తల్లీ తండ్రీ అని నమ్మి అతని విూద భారం వేసి బ్రతికేవాడు యధార్ధమైనభక్తుడు. ఓ కీర్తన కారుడు.

"ప్రభువు తల్లి పక్షిలా నిన్ను తన రెక్కలతో కప్పతాడు
అతని రెక్కల క్రింద నీవు సురక్షితంగా వుండిపోతావు"

అన్నాడు-91,4. అలాగే మరో కీర్తనకారుడు.

"ప్రభువు నాకు దీపం వెలిగిస్తాడు
నా త్రోవలోని చీకటిని తొలగిస్తాడు"

అని పల్కాడు - 18,28. ఈలాంటి భావాలను అనుభవానికి తెచ్చుకొని క్రైస్తవ కుటుంబీకులు కష్టసుఖాల్లో కూడ ఆ భగవంతుని విూదనే ఆధారపడి జీవించాలి.

8. దేవునికి ఊడిగం

పూర్వనూత్న వేదాల సంధికాలంలో జీవించిన వృద్ధ దంపతులు జెకరియా యెలిసబేత్తులు. ఈ పుణ్యదంపతులు దేవుడిచ్చే బహుమానాల కోసంగాక దేవుడి కోసమే దేవుణ్ణి సేవించినవాళ్లు. వాళ్ళిద్దరూ దేవుని సృష్టిలో నీతిమంతులు. ఆయన ఆజ్ఞలను తూచ తప్పకుండ పాటించినవాళ్లు - లూకా 1,6. దేవుడు భక్తిమంతులను సంతానంతో దీవిస్తాడని పూర్వవేద ప్రజల నమ్మకం. ఐనా ఈ భార్యాభర్తలకు పిల్లలు లేరు. వాళ్ళిద్దరూ ఏళ్ళు చెల్లిన వృదులు. కనుక ఇక బిడ్డలు పుడతారనే ఆశకూడ లేదు. అలాంటి నిరాశాపరిస్థితుల్లో గూడ జెకరియా యెలిసబేతులు ప్రభువుని గాడభక్తితో సేవించారు. వాళ్ల గొప్పతనమంతా ఈ నిస్వార్ధ భక్తిలోనే వుంది. ఇక వుదార గుణంలో నరుడు భగవంతునికి తీసిపోయేవాడు కాదుగదా! కనుక ప్రభువు ఆ యాలుమగలకు ఓ బిడ్డడు పుడతాడని గబ్రియేలు దూత ద్వారా కబురు పంపాడు. ఆ బిడ్డడడే స్నాపక యోహాను - లూకా 1,12.