పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/217

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ దంపతుల మధ్య తరచుగా తగాదాలు మనస్పర్ధలు వస్తుంటాయి. ఐనా మన అపరాధాలు గోమెరు అపరాధమంత ఫనోరమైనవి కానే కావు. కనుక క్రైస్తవ దంపతులు ఒకరినొకరు సులభంగా క్షమించుకొంటుండాలి. విపరీతమైన అభిమానము, నామాటే నెగ్గాలి అనే పట్టుదలా వుంటే కుటుంబాలు నడవ్వు.

3. సంతానం

1. సంతాన వాంఛ

ఇప్పటి మన నాగరికత ప్రకారం ముగ్గురు బిడ్డలు చాలులే అనికొంటూంటాం. కొందరు ఒక బిడ్డతోనే సరిపెట్టు కొంటూంటారు. అసలు పిల్లలే వదు అనుకొనే తల్లిదండ్రులు కూడ లేకపోలేదు. కాని ప్రాచీన కాలంలో ఈలాంటి భావాలు వుండేవి కావు. అన్ని ప్రాచీన జాతులూ సంతానాన్ని కోరుకొన్నాయి. హిందూ దేశీయులూ, చైనా దేశీయులూ, ఐగుప్రీయులూ, యిస్రాయేలీయులూ సంతానాన్ని మక్కువతో వాంఛించారు. విశేషంగా హీబ్రూ ప్రజలు సంతానాన్ని దేవుని దీవెన గాను నిస్సంతానాన్ని దేవుని శాపంగాను ఎంచారు.

దేవుడు అబ్రాహాముతో "నీ సంతానం ఆకాశంలోని చుక్కల్లాగ సముద్ర తీరంలోని యిసుక రేణువుల్లాగ అసంఖ్యాకంగా వృద్ధి చెందుతుంది" అని వాగ్గానం చేసాడు - ఆది 22.17. రిబ్మాను సేవకుని వెంట అబ్రాహాము ఇంటికి పంపుతూ ఆమె తోబుట్టువులు "తల్లీ! నీవు మా సోదరివి. నీకడుపు పండి గంపెడు పిల్లలను కందువుగాక" అని దీవించారు - ఆది 24,60. కీర్తనకారుడు "నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షలతలా వుంటుంది. భోజనపు బల్ల చుట్టు నీ పిల్లలు ఓలివు పిలకల్లా కనబడతారు" అంటాడు - 128,3-4. హీబ్రూ ప్రజలకు సంతానం విూద గల గౌరవం ఈలాంటిది.

ఇక, సంతానం లేకపోవడం దైవ శాపానికి నిదర్శనం. అందుకే గొడ్రాలైన రాహేలు "నీవు నాకు పిల్లలను పుట్టిస్తావా లేక ఏ గొయ్యో నుయ్యో చూచుకొని నన్ను చావమంటావా?" అని యాకోబును పీడించింది-ఆది 30,2 సారను చెరపట్టినందుకు శిక్షగా దేవుడు అబీమెలకు కుటుంబంలోని ప్రతి స్త్రీని గోడ్రాలినిగా చేసాడు - ఆది 20,18.

యిప్రాయేలీయులు సంతానాన్ని పరమ పవిత్రంగాను దేవుడిచ్చే దీవెనగాను భావించారు. అనిచెప్పాం. కనుకనే క్రీస్తు కూడ చిన్నబిడ్డల పట్ల ఎంతో ఆదరం చూపాడు, ఓమారు కొందరు తల్లలు చిన్నబిడ్డలను తీసుకొని క్రీస్తు చెంతకురాగా శిష్యులు వాళ్లను కసిరికొట్టారు. కాని ప్రభువు శిష్యులను మందలించి ఆ తల్లలను తన దగ్గరకు చేరబిలిచాడు. ఆ బిడ్డల విూద చేతులు చాచి వాళ్లను దీవించాడు. బిడ్డలు తల్లిదండ్రుల విూద ఆధారపడి