పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భార్యా నేను ఈ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నానా లేదా అని పరిశీలించి చూచుకోవాలి. విశేషంగా భార్య ఈ విషయంలో చాల మెలవకువతో ప్రవర్తించాలి. ఆమె లైంగిక క్రియ అసహస్యమైంది అన్నట్లుగా ప్రవర్తించగూడదు. తన రూపంలోనైతేనేమి చేతల్లోనైతేనేమి పెనిమిటికి అనాకర్షణీయంగా కన్పించి అతని మనసు మరో స్త్రీ విూదికి పోయేలా చేయకూడదు. భార్య దేహదానాన్ని నిరాకరిస్తే ఇక ఆ కుటుంబంలో కలహాలు కొనితెచ్చుకొన్నట్లే. సినిమాలు ప్రకటనలు మొదలైన ప్రచార సాధనాలతో నిండిపోయిన ఆధునిక ప్రపంచంలో భార్యభర్తల దాంపత్య జీవితాన్ని భగ్నం చేసే శోధనలు ఎన్నెనా ఎదురౌతాయి. కనుక క్రైస్తవ దంపతులు ఈ రంగంలో చాల చిత్తశుద్ధితో ప్రవర్తించాలి.

2. భార్యాభర్తలు

1. భార్యాభర్తల ప్రేమ

భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ వుండాలి. ఈ ప్రేమ లేందే కుటుంబాలు నిలవ్వు దావీదు కథే దీనికి నిదర్శనం. దావీదు సౌలు కొమార్తెయైన విూకాలును పెండ్లియాడాడు. కొంతకాలం పాటు వాళ్లిద్దరు పరస్పర ప్రేమతో జీవించారు. సౌలు దావీదును చంపడానికి కుట్ర పన్నగా మిూకాలు అతని ప్రాణాలు కాపాడింది కూడ - 1సమూ 19,11-12. కాని క్రమేణ వారి దాంపత్యప్రేమ చల్లారిపోయింది. ఓమారు దావీదు దైవమందసాన్నియెరూషలేముకు తరలించుకొని వస్తూ భక్తిభావంతో దాని ముందు నాట్యంచేసాడు. కాని ఆ నాట్యాన్ని చూచి మిూకాలు దావీదుని పరిహసించింది. కోణింగిలా వున్నావని యొగతాళి చేసి అతన్ని చిన్నచూపు చూచింది. దానితో దావీదుకు ఆమె విూద విరక్తి పుట్టింది. విూకాలుకు మాత్రం చనిపోయే వరకు దావీదు వలన బిడ్డలు కలుగనే లేదు-2 సమూ 6,16-22. ఈ విధంగా ఈ దంపతులిద్దరూ పరస్పర గౌరవమూ ప్రేమా కోల్పోయారు. క్రైస్తవ దంపతులు ఈలా ప్రవర్తించగూడదు. అతడు క్రీస్తకీ ఆమె శ్రీ సభకీ పోలికగా వున్నవాళ్లు కనుక పరస్పర గౌరవమర్యాదలతోను ప్రేమాదరాలతోను జీవించాలి.

నాబాలు ఆబీగాయిలు అనే దంపతులు వుండేవాళ్లు. నాబాలు ధనవంతుడు. కాని వట్టి మూర్ణుడు, మొరటువాడు. అతని భార్య అబీగాయిలు తెలివైనది, యోగ్యురాలు. దావీదు ప్రవాసంలో వుండి ఆకటి వలన బాధపడుతూ నాబాలు నొద్దకు సేవకులను పంపి తనకు కొన్ని ఆహారపదార్థాలు ఈయవలసిందిగా కోరాడు. కాని మూర్ఖుడైన నాబాలు దావీదు సేవలకులను అవమానించి పంపాడు. దావీదు నాబాలుని చంపడానికి