పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌలు భార్యాభర్తల ప్రేమను శ్రీసభకూ క్రీస్తుకూ వుండే ప్రేమతో పోల్చాడు. క్రీస్తు శ్రీసభను ప్రేమించి ఆ సభ కోసం ప్రాణాలు ఒడ్డినట్లే భర్తకూడ భార్యను ప్రేమించి ఆమెకోసం ప్రాణాలు అర్పించాలి - ఎఫె 5,25. "వాళ్లిద్దరూ ఏక వ్యక్తిగా ఐక్యం కావాలి" అనే ఆదికాండవచనం క్రీస్తకీ శ్రీసభకీ వర్తిస్తుంది - 5,81-32.

ఇక్కడ శ్రీసభ అంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ భక్తులమైన మనం. క్రీస్తుకి క్రైస్తవ ప్రజల పట్లగల ప్రేమను భర్తకి భార్యపట్ల వుండే ప్రేమతో పోల్చాడు పౌలు. భార్యా భర్తల ప్రేమ, వాళ్ల లైంగిక జీవితం, పవిత్రమైంది కాకపోయినట్లయితే పౌలు దాన్ని క్రీస్తు ప్రేమతో పోల్చివుండేవాడేనా? కనుక లైంగిక జీవితం పరిశుద్ధమైంది. కావుననే దాన్ని మనం కామభావాలతో, జంతుధృష్టితో అమంగళపరచగూడదు.

3. భార్యాభర్తల విశ్వసనీయత

వివాహాన్ని లైంగిక జీవితాన్ని భగవంతుడే నిర్ణయించాడు అన్నాం. కనుక భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే వాళ్లు పరస్పరం ద్రోహం చేసికోవడం మాత్రమే కాదు, వివాహకర్తయైన దేవునికి గూడ ద్రోహం చేస్తారు.

బాబిలోనియా దేశంలో యొవాకిం భార్యయైన సూసన్న భక్తురాలిని ఇద్దరు వృద్ధులు పాపానికి ప్రేరేపించారు. ఆమె వారితో “దేవుడు చూస్తుండగా ఈలాంటి పాడుపని ఏలా చేసేదీ" అంది - దాని 18,23. దైవభీతి వలన సూసన్న పాప కార్యానికి పాల్పడలేదు. ఇది పూర్వవేద భక్తి.

ఇక, నూత్నవేదంలో వివాహం ఓ సంస్కారం. అది క్రీస్తుకీ క్రైస్తవ సమాజానికీ మధ్య వుండే ప్రేమకు చిహ్నంగా వుంటుంది అని చెప్పాం. కనుక భార్యాభర్తలు ఒకరికొకరు వివాహ ద్రోహం చేసికొన్నపుడు క్రీస్తుకే ద్రోహం చేసినట్లు అవుతుంది.

పౌలు వివాహ జీవితాన్ని గూర్చి వ్రాస్తూ భార్యాభర్తల దేహదానాన్ని పేర్కొన్నాడు. భర్త భార్యకీ, భార్య భర్తకీ వివాహ ధర్మాన్ని నిర్వర్తించాలి. భార్య శరరం విూద భర్తకీ, భర్త శరీరం విూద భార్యకీ అధికారం వుంది. కనుక వాళ్ళిద్దరు ఒకరికొకరు దేహదానం కావించుకోవాలి. అనగా ఒకరు కోరినపుడొకరు కలయికకు అనుమతించాలి. దంపతులు కొంతకాలం ప్రార్థనలో గాని భక్తికృత్యాల్లో గాని గడపదల్చుకొంటే పరస్పర ఒప్పందం మిూద కొన్ని దినాల పాటు ఒకరి కొకరు ఎడంగా వుండవచ్చు. కాని అటుపిమ్మట మల్లా పరస్పర దేహదానం కావించుకోవాలి 1కొరి 7,3-5. వివాహ బంధం పెట్టుకొన్నవాళ్లకి పౌలు పేర్కొన్న ఈ ధర్మం చాల ముఖ్యమైనది. కనుక భర్త తరపున భరా, భార్య తరపున