పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. కుటుంబ జీవితం

                                                                                                              బైబిలు భాష్యం - 34
                                              విషయసూచిక
1. వివాహ బంధం 205
 2. భార్యాభర్తలు 207
 3. సంతానం 209
 4. కుటుంబ ధర్మాలు 211
5. ప్రేషితులుగా గృహస్థలు 218

                                             

1. వివాహ బంధం


1. వివాహబంధం దేవుడే నిర్ణయించాడు


నరులను సృజించింది దేవుడే "దేవుడు మానవజాతిని సృజించాడు. తనకు పోలికగా మానవుని చేసాడు. ఆ మానవుని స్త్రీ పురుషులనుగా సృజించాడు" - ఆది 1,27.
ఈలా తాను సృజించిన స్త్రీ పురుషులను భార్యాభర్తలను చేసింది గూడ ఆ ప్రభువే. అతడు ఓవైద్యుని లాగ ఆదాము ప్రక్కటెముకను తీసి దానిని ఓ స్త్రీగా మలచాడు. ఆమే ఏవ - 2,22. ఈ యేవ ఆదాము లాంటిది, అతని కోవకు చెందింది. అతని యెముకలూ శరీరమూ హృదయమూ ఆమెలో వున్నాయి. కనుక ఆమె పురుషుని వైపు బలంగా ఆకర్షింపబడుతూంటుంది. ఇక ఆదాము తనతరుపున తాను "ఈమె నా యెముకల్లో యెముక నా శరీరంలో శరీరం" అనుకొని ఆమెవైపు ఆకర్షింపబడుతూంటాడు. ఆమె అతనికి తోడుగా వుంటుంది. ఆదాము నాటి నుండి ప్రతి పురుషుడూ తల్లిదండ్రులను గూడ విడనాడి తన ఆలికి హత్తుకొనిపోతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరై కూడ ఏకశరీరులు, ఏకవ్యక్తి అన్నంత సన్నిహితంగా ఐక్యమైపోతారు–2,23. ఈ యైక్యత వల్లనే స్త్రీ పురుషులు బిడ్డలను కని వ్యాప్తి చెందుతారు– 1,28. ఈలా భగవంతుడు స్వయంగా ఐక్యపరచిన భార్యాభర్తలను ఏ నరుడూ వేరుపరుపకూడదు. అది పవిత్రబంధం - మత్త 19,6. కనుక వివాహ జీవితం గడిపేవాళ్ళు ఆ జీవితం పట్ల పవిత్రమైన భావాలు పెంపొందించుకోవాలి.

2. లైంగిక జీవితం పవిత్రమైంది


భగవంతుడే నిర్ణయించింది గనుక లైంగిక జీవితం పవిత్రమైందని భావించింది పూర్వవేదం. నూత్న వేదం ప్రకారం గూడ భార్యభర్తల లైంగిక జీవితం పరమ పవిత్రమైంది. 205