పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవర్తించగూడదు. భగవంతుణ్ణి మెప్పించే ప్రయత్నం చేయాలి. మనవ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకొని భవిష్యక్టీవితానికి తయారుకావాలి. ఇక్కడ మనం క్రీస్తుని సాక్షాత్కారం చేసికోందే తరువాత అతన్ని ప్రజలకు చూపించలేం.

6. మన హృదయాలు ప్రేమకోసం సృజింపబడ్డాయి. ప్రేమించందే వాటికి తృప్తి అంటూలేదు. కాని గురువులూ మఠకన్యలూ ఐనవాళ్లకి లైంగికప్రేమ నిషిద్ధం. కనుక మనం పవిత్రమైన నిర్మలప్రేమతో క్రీస్తుని ప్రేమించడం నేర్చుకోవాలి. లేకపోతే తరువాత పాపపప్రేమల్లోచిక్కిభ్రష్టులమైపోతాం. ఈ నిర్మలప్రేమనుగూర్చి బెర్నారు భక్తుడు ఈలా వ్రాసాడు.

ఇప్పడూ యెప్పడూ ప్రభువునందే
నిద్రబోతున్నా మేల్మోనివున్నా
ప్రేమిస్తున్నా ప్రేమింపబడుతూన్నా
విచారంగావున్నా సంతోషంగావున్నా
ఆరోగ్యంగావున్నా వ్యాధిగావున్నా
జీవిస్తున్నా చనిపోతూన్నా
అంతా ఆ ప్రభువునందే

5. సువార్తను ప్రకటించడం

“దేవుడు నేను అన్యజనులకు తనకుమారుడ్డి ప్రకటించాలని కోరుకొన్నాడు" అన్నాడు పౌలు. సువార్తా ప్రచారమనేది ప్రేషితుల బాధ్యత. కనుక పిలుపు నందుకొనిన యువతీయువకులు ప్రేషితోద్యమానికి ఏలా సంసిద్దులుకావాలో పరిశీలించిచూద్దాం.

1. పంటపొలం

క్రీస్తు శిష్యులతో "పంట విస్తారంగా వుందిగాని కోతగాళ్లు తక్కువ. పంటను ప్రోగుచేయడానికి పనివాళ్లను పంపమని పంటయజమానుని మనవిచేయండి" అన్నాడు - మత్త 9,37-38. ఇక్కడ పంటయజమానుడు పరలోకపితే కోతగాళ్లు ప్రేషితులు. సేకరించవలసినపంట ప్రజలే. ఎప్పుడూ ప్రజలకు భగవంతుడ్డిగూర్చి తెలియజెప్పేవాళ్లు తక్కువే. కనుక ఎక్కువ మంది పిలుపునందుకొని ముందుకువచ్చి సువార్తను బోధించాలి. ప్రజలను దేవునివైపు మరల్చాలి.

2. ద్రాక్షలత క్రీస్తు శిష్యులతో "కొమ్మ ద్రాక్లతీగలోనికి అతుకుకొని వుండందే తనంతటతాను ఏలాగు ఫలింపలేదో ఆలాగే మీరూ నాలో నిలిచివుంటేనేగాని ఫలింపలేరు" అన్నాడు -