పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రోయబడ్డావు" అని వ్రాసాడు - 14,15, ఈ రాజు యావే ప్రభువును ధిక్కరిచి గర్వంతో ఈలా భావించుకున్నాడు. తొలి ఆదాము పాపంకూడా యిదే. ఈ యవిధేయతను మనస్సులో పెట్టుకొనే ద్వితీయోపదేశకాండం "నా యాజ్ఞలన్నిటిని నీవు అనుసరించాలి. లేకుంటే నా శాపాలన్నీ నీకు తగులుతాయి" అని హెచ్చరిస్తుంది - 28,15. ఈలా అవిధేయత లేక గర్వమనే పాపాన్ని పూర్వవేద ప్రవక్తలు సర్వత్రా ఖండిస్తూ వచ్చారు. మానవుని పతనానికి ఇది మూలకందం.

26. మా తండ్రుల పాపాలు మేమనుభవిస్తున్నాం - విలాప 5,7

ప్రవక్తల భావాల ప్రకారం, యిస్రాయేలు ప్రజల పాపాలు పాపంచేసిన వ్యక్తలను మాత్రమేగాక యిస్రాయేలు ప్రజానీకాన్నంతటినీ బాధిస్తాయి. ఆకాను పాపంచేయగా ఆ పాపం యిస్రాయేలు సైన్యాలన్నిటినీ బాధించి వాళ్ళకు ఓటమి తెచ్చిపెట్టింది - యోషు 7, 10-12 యోషువాకూడ పాపియైన ఆకాను నొక్కట్టే కాకుండా కుటుంబ సమేతంగా కాల్చి చంపించాడు - 7,24. యావే యెవరైనా తన్ను ద్వేషించినట్లయితే నాలుగు తరాలదాకా తండ్రుల దోషాలను కుమారులమీదకు రప్పిస్తాడు - నిర్గ 20,5. కనుకనే బాబిలోను ప్రవాసంలో వెతలనుభవిస్తూవున్న యూదులు "మా తండ్రులు పాపంచేసి గతించిపోయారు. మేము మాత్రం వాళ్ళ పాపాల శిక్షను అనుభవిస్తూనే వున్నాం" అనుకుంటారు - విలాప 5,7, “తండ్రులు పచ్చి ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పండ్లు పులుపెక్మాయి" అనుకోవడం యిస్రాయేలు ప్రజలకు సామెత ఐపోయింది - యిర్మీ 31, 29. ఈ వాక్యాలన్నిటిని బట్టి పాపం వ్యక్తిని మాత్రమేగాక సమాజాన్ని కూడ బాధించేట్ల యిస్రాయేలు ప్రజలు భావించారని రుజువెతుంది. కాని పాపంలో వ్యక్తిగత శిక్ష లేదని కాదు. "పాపం చేసినవాడెవడో వాడే మరణిస్తాడు" అని హెచ్చరిస్తాడు యెహెజ్కేలు - 18.4 అంచేత పాపం వ్యక్తిగత శిక్షతోపాటు సామాజిక శిక్షను కూడ తెచ్చిపెడుతుందనే పై వాక్యాల తాత్పర్యం.

27. నేను అసూయాపరుణ్ణియిన దేవుణ్ణి - నిర్ణ 20,5.

ప్రభువు మోషేతో "నేను అసూయాపరుణ్ణియిన దేవుణ్ణి" అంటాడు - నిర్గ 20,5, భర్త భార్య విషయంలో అసూయ పడినట్లే ప్రభువు కూడ తన ప్రజలను గూర్చి అసూయపడతాడు. అనగా వాళ్ళు అన్యదైవతాలను ఆరాధించటం సహించలేడని భావం, ప్రభువు తన ప్రజలను ప్రేమిస్తాడు గనుకనే, ఆ ప్రజ మేలు కోరుకుంటాడు గనుకనే, వాళ్ళను గూర్చి అసూయపడతాడు. ప్రభువునకు ప్రజలపట్ల వుండే యీ ప్రేమతోడి అసూయను మనసులో పెట్టుకునే యెషయా "నిన్ను సృజించినవాడే నీ భర్త పరిత్యక్తయై దుఃఖాక్రాంతురాలైన భార్యను భర్త మళ్ళా రప్పించుకున్నట్లే, తృణీకృతయైన యవనకాలపు భార్యను పురుషుడు మళ్లా పిలిపించుకున్నట్లే, యావే నిన్నూ పిలుస్తున్నాడు" అని వ్రాసాడు