పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/189

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవ ప్రకృతి


మోసమూ, డంబమూ
విచ్చలవిడిగా తిరగడం
ఇతరుల అధికారాన్ని
సహించకపోవడం
స్వీయలాభం కోరడం
స్వీయ ఘనత కోరడం
శరీర సుఖాలు
నాజూకు వస్తువులపై మోజు
అనిత్య సుఖాలు వెదకడం
పుచ్చుకోవడం
వస్తువులు కూడబెట్టడం
ప్రపంచాడంబరాలవైపు ఆకర్షణ
సంచార ప్రీతి
ఇతరుల బహుమతులు కావాలి
ఇతరుల మెప్పలు పొందాలి
అధికారులు, గొప్పవాళల్లా
మనకు స్నేహితులు కావాలి
కష్టాలు సహించకపోవడం
వార్తలూ సుద్దులూ కావాలి
సృష్టివస్తువుల వైపు ఆకర్షణ


దైవ వరప్రసాదం


నిరాడంబరం
ఆత్మనిగ్రహం

ఇతరులకు లోంగివుండడం
పరుల లాభం
దేవుని మహిమపరచడం
కష్టపడి పనిచేయడం
సామాన్య వస్తువులు చాలు
శాశ్వత సుఖాలు
ఈయడం
పంచుకోవడం
దేవునివైపు ఆకర్షణ
నిలకడ
దేవుడే మన బహుమతి
దేవుళ్లే స్తుతించాలి

దేవుడే స్నేహితుడు
తాల్మి
లోకంలో క్రొత్త యేముంది?
సృష్టికర్తవైపు ఆకర్షణ

44. దేవుని ఆత్మచే నడిపింపబడ్డ మనేది జీవితంలో ఒక్క సన్నివేశానికి గాని లేక ఒక్క రోజుకి గాని సంబంధించినది గాదు. మన జీవితమంతా ఆత్మచేత నడిపింప బడుతూండవలసిందే. మన కార్యాలన్నీ ఆత్మ అనుగ్రహంతో కొనసాగి పోతుండవలసిందే. కనుక భక్తుడైనవాడు రోజురోజూ, వారవారమూ, నెలనెలా తన దినచర్యను పరిశీలించి చూచుకొంటూంటాడు. తన ప్రార్థనల్లో, ఆత్మశోధనల్లో, ధ్యానాల్లో వడకాల్లో తాను ఏ యాత్మ చేత నడిపింప బడుతున్నాడో జాగ్రత్తగా పరిశీలించి చూచుకొంటూంటాడు. ఇగ్నేప్యసు తన్ను ఏయాత్మ నడిపిస్తుందో రోజూ ఆత్మశోధనల్లో తరచితరచి చూచుకొనేవాడని చెప్పాం. మనం కూడ రోజూ ఈలా ఆత్మపరీక్ష చేసికొంటూంటే ఎంత బాగుంటుంది! ఇంకా చూడు, బైబులు ధ్యానాలు 29, "రెండు మార్గాలు"