పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/179

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంతృప్తి ఉత్సాహమూ గోచరించేవి. ఈ మనోస్థితిని బట్టి అతడు తొలిరకపు తలంపులు పిశాచం నుండి వచ్చాయనీ రెండవరకపు తలంపులు పరిశుద్ధాత్మ నుండి వచ్చాయనీ నిర్ణయించుకొన్నాడు. పండును బట్టిచెట్టును నిర్ణయించాడు. తాను రాజసేవను మానుకొని దైవసేవలో చేరాడు. 20. పరివర్తనానంతరం ఇగ్నేష్యసు జపతపాల్లో కాలం గడుపుతూ మనేసా గుహలో కొంతకాలం వసించాడు. ఆ సమయంలో అతనికి ప్రకాశిస్తున్న ఓ సుందరవస్తువు కన్పించేదట. అది పాము ఆకారంలో వుండేదిట. దాన్ని చూచినంత సేపూ అతనికి ఎంతో ఆనందం కలుగుతుండేది. కాని ఆదర్శనం తొలగిపోగానే అతని హృదయంలో ఏదో అసంతృప్తి నిరుత్సాహమూ గోచరించేవి. ఈ మనోస్థితిని బట్టి అతడు దాన్ని పిశాచ దర్శనంగా నిర్ణయించాడు. మళ్లా ఆ మెరిసే పాము కన్పించినపుడు దాన్ని తన కర్రతో బాది తరిమివేసేవాడు. ఆ సమయంలోనే అతని అంతరాత్మలో "నీ వింకా జీవించబోయే డెబ్బెయేండూ ఈలాంటి కఠిన తపస్సులు ఏలా భరిస్తావు?" అనే ఓ ప్రశ్న విన్పిస్తుండేది. ఆప్రశ్న ఏయాత్మనుండి వచ్చిందో గుర్తించి "ఓరీ పిశాచమా! నీవు డెబ్బెయేండ్లు కాదుగదా ఒకరోజు ఆయవు మాత్రము ఈయగలవా?" అని అడిగేవాడు. దానితో ఆశోధన తొలగిపోయింది. ఈలా అతడు పిశాచ ప్రబోధాన్ని గుర్తించేవాడు, జయించేవాడు. 21. పరివర్తనం తర్వాత ఇగ్నేప్యసు చిన్నపిల్లలతో గలసి వ్యాకరణమూ లెక్కలూ మొదలైన ప్రాథమికవిద్యలు నేర్చుకోవడం మొదలెట్టాడు. కాని అతడు చదువుకోబోయేప్పడెల్లా ఓ విధమైన ఆనందానుభూతి కలిగేది. కన్నీళ్లు ధారగా కారేవి. హృదయంలో గొప్ప భక్తిభావం జనించినట్లుగా కన్పించేది. ఐతే ఈ భక్తిపారవశ్యం వల్ల అతని చదువు కుంటుపడిపోయేది. అతడు పాఠాలు నేర్చుకునేవాడు కాదు. ఇది చూచి ఇగ్నేప్యసు నిశితంగా విచారించి చూచుకొన్నాడు. తన చదువుకు అంతరాయం కలిగించే ఈ యానందానుభూతి సదాత్మ నుండి వచ్చివుండదని నిర్ణయించుకొన్నాడు. వెంటనే తన ఉపాధ్యాయుని వద్ద కెళ్లి ఇక తాను ఈలాంటి ఆనందానుభూతికి లొంగిపోననీ, పారాలు శ్రద్ధగా చదివి ఒప్పజెపుతాననీ ప్రమాణం చేసాడు. తరువాత ఆయానందానుభూతి దానంతటదే ఆగిపోయింది. ఇంకోమారు ఓ పెద్ద గోయి కన్పింపగా అతనికి ఆత్మహత్య చేసికోవాఉఅనే బుద్ధి పుట్టింది. కాని ఆ కోరిక ఎక్కడ నుండి వచ్చిందో అతడు గుర్తింపగలిగాడు. ఈ విధంగ అతడు ఒక్కో కార్యాన్నీ ఒక్కోకోరికనీ జాగ్రత్తగా పరిశీలించి చూచేవాడు. ఏది పిశాచ ప్రబోధమో ఏది సదాత్మ ప్రబోధమో గుర్తుపట్టేవాడు. 22. ఇగ్నేప్యసుకు అప్పడప్పడూ ప్రభు దర్శనం లభిస్తుండేది. ప్రభువు అతనికి ఒకోమారు సూర్యుడు లాగ, ఒకోమారు తెల్లని ఆకృతితోను దర్శన మిచ్చేవాడు. కాని ఈ దర్శనాలు చాల అస్పష్టంగా వండిపోయేవి. ఐనా అతడు దర్శన ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి చూచుకొనేవాడు. ప్రభు సాక్షాత్కారం వల్ల అతనికి తన విూద తనకే ఏహ్యభావం