పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనుల మొర అతని చెవిని పడితీరుతుంది. ప్రజాపీడకులనూ దోపిడి గాండ్రనూ అతడు నిశితంగా శిక్షించితీరుతాడు.

3. వాగ్దత్తభూమి యావేది. అతడు ఆ గడ్డను యిప్రాయేలీయులందరికీ కానుకగా యిచ్చాడు. వాళ్లు దాన్ని తాత్కాలికంగా అనుభవించేవాళ్ళ మాత్రమే. ఆ నేల ఎవరి కాణాచీ కాదు. యూదుల్లో ఎవరైనా పేదవాళ్ళంటే ధనవంతులు వాళ్ళను ఆదుకోవాలి. అంటే భాగ్యవంతులు తమ ఆదాయంలో ఓ ఐదు శాతమో లేక పదిశాతమో పేదల కిచ్చివేస్తే సరిపోదు. దరిద్రుల అక్కరలు తీరిందాకా - అనగా ఇలూ వాకిలీ కూడూ గుడ్డా అబ్బిందాకా - వాళ్ళకు సహాయం చేయవలసిందే.

4. యిస్రాయేలీయుల్లో కొందరు ఐశ్వర్యవంతులై పెద్దపెద్ద భవనాల్లో సుఖంగా జీవిస్తున్నారు. మరికొందరు దరిద్రులై గుడిసెల్లో తలదాచుకొంటూ ఆకటితో ప్రుగ్గిపోతూన్నారు. ఇది సాంఘిక అన్యాయం. వీళ్ళంతా దేవుని ప్రజలై దేవుని భూమిని అనుభవించేవాళ్ళ గనుక పేదవాడికి ధనవంతుని సిరిసంపదల్లో పాలుపొందే హక్కు వుంది. పీడితులకూ దీనులకూ ధర్మశాస్త్రమే హక్కులు ప్రసాదించింది. వాగ్దత్తభూమినిలాగే దానిమీద వచ్చే ఆదాయాన్నిగూడ ప్రభువు యిప్రాయేలీయు లందరికోసం ఉద్దేశించాడు. కనుక ధనవంతుడు కూడబెట్టిన సొమ్ములో పేదవాడికిగూడ వాటా వుంది.

5. రాజులకూ న్యాయాధిపతులకూ పేదలహక్కులను నిలబెట్టవలసిన బాధ్యత వుంది. వాళ్లు లంచాలు తీసికొని పేదలకు న్యాయం చేకూర్చకపోతే అది ఘోరమైన సాంఘిక అన్యాయం ఔతుంది.

6. నరుని రక్షణం సాంఘికన్యాయాన్నిపాటించడంమీద గూడ ఆధారపడుతుంది. ఓ వైపు తోడి నరుణ్ణి పీడిస్తూ మరోవైపు దేవాలయానికి వెళ్ళి ఆరాధనలు చెల్లిస్తే దేవుడు అంగీకరించడు. ఆలాంటి ఆరాధనం అపవిత్రమైంది, హృదయశుద్ధి లోపించింది. కనుక సాంఘికన్యాయాన్ని పాటించని ఆరాధనలు నిప్రయోజనం. క్రీస్తవాక్కులే దీనికి ప్రబల తార్మాణం, ఆ ప్రభువు ఈలా వక్కాణించాడు:

"నా తండ్రిచేత దీవింపబడినవారలారా రండి: రాజ్యాన్ని చేకొనండి, నేను ఆకలిగొంటే మీరు అన్నంపెట్టారు. దప్పికగొంటే దాహం తీర్చారు. పరదేశినైయుంటే నన్ను ఆదరించారు. వస్త్రహీనునైవుంటే బట్టలిచ్చారు. రోగినిగావుంటే, చెరసాలలో వుంటే నన్ను దర్శించారు. నా సోదరుల్లో అత్యల్పడైనవాడికి మీరు ఈ లాంటి కరుణకార్యాలు చేసారు కనుక అవి నాకు చేసినట్లే లెక్క.

శాపగ్రస్తులారా! మీరు నా వద్దనుండి తొలగిపోయి నిత్యనరకాగ్నిలో పడండి. నేను ఆకలిగొంటే మీరు అన్నం పెట్టలేదు. దప్పిక గొంటే దాహమీయలేదు. పరదేశినై యుంటే నన్ను దర్శింపలేదు. వస్త్రహీనుణ్ణయివుంటే బట్టలీయలేదు. రోగినిగాను చెరసాలలోను వుంటే నన్ను పరామర్శించలేదు. నా సోదరుల్లో అత్యల్పడయినవాడికి మీరు ఈలాంటి కరుణ కార్యాలు చేయలేదుగనుక అవి నాకు చేయనట్లే లెక్క" - మత్త 25, 35-45.