పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీ దుష్కార్యాలు అన్నీయిస్నీగావు" - 5,11-12 ఈలా ధనవంతులు పేదలకు సహాయంచేయాలనీ లేకపోతే దైవశాపానికి గురౌతారనీ హెచ్చరించాడు ప్రవక్త ఆమోసు. పేద ప్రజలకు న్యాయం జరగాలని అతడు ఎలుగెత్తి చాటాడు:

"నీతి ఓ నదిలాగ పొంగిపారాలి న్యాయం ఓ జీవనదిలాగ ప్రవహించాలి" - 5,24 ఔను, న్యాయాధిపతులూ రాజులూ ధనవంతులూ కూడ సాంఘిక న్యాయాన్ని నిలబెట్టాలి. పేదలకు జరిగే అన్యాయాలను అరికట్టాలి. లేకపోతే ప్రభువు వాళ్ళను దారుణంగా శిక్షిస్తాడు.

4. సాంఘిక న్యాయమూ, ఆరాధనమూ

కొందరు యిస్రాయేలీయులు సాంఘిక న్యాయాన్ని పాటించకుండానే దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు కాని ప్రవక్తలు ఈలాంటి ఆరాధనంవల్ల లాభంలేదని ఖండితంగా చెప్పివేసారు. ఇక్కడ మూడంశాలు చూడాలి.

1. మొదట పొత్తు కుదిరింది

సాంఘిక న్యాయమంటే తోడిజనాన్ని విశేషంగా పేదజనాన్ని ఆదరించడం, యి(సాయేలు యూవే ప్రజ. వాళ్ళంతా ఆ ప్రభువుని ఆరాధించేవాళ్లు.ఆలా ఆరాధించేవాళ్ళంతా ఒక్క సమాజంగా ఏర్పడి పరస్పర సోదరభావంతో జీవించారు. కనుక వాళ్లు ప్రభువుని దేవుణ్ణిగా అంగీకరించినప్పడే తోడి నరుడ్డిగూడ సోదరుడ్డిగా అంగీకరించారు. ఐగుప్త నిర్గమనం సాంఘిక అన్యాయానికి సంబంధించింది అన్నాం. ఆ యన్యాయంనుండి యిప్రాయేలును కాపాడినవాడు ప్రభువు. అప్పటినుండి యిప్రాయేలు యావేను ప్రభువుగాను తోడినరులను సోదరులనుగాను అగీకరించింది. తర్వాత ప్రభువు సీనాయికొండవద్ద తమతో నిబంధనం చేసికొన్నపుడుగూడ ప్రజలు ఈ రెండు సత్యాలూ గుర్తించారు. మోషే ధర్మశాస్తాన్ని ప్రతిపాదించే లేవీయకాండా ద్వితీయోపదేశకాండాగూడ దేవుణ్ణి ఆరాధించాలనీ తోడి జనాన్ని ప్రేమించాలనీ బోధించాయి. ఈలాయిస్రాయేలీయుల జీవితపు తొలిరోజుల్లో ఆరాధనకూ సాంఘిక న్యాయానికీ పొత్తు కుదిరింది.

2. తర్వాత పొత్తు కుదరలేదు

క్రమేణ సాంఘిక న్యాయమూ దైవారాధనమూ రెండుగా విడిపోయాయి. ప్రజల్లో డాంబికత్వం పెచ్చుపెరిగింది. చిత్తశుద్ధి లేకపోయినా కర్మకాండలూ బాహ్యాచారాలూ