పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/153

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యూద బానిస నీచమైన పనులు చేయనక్కరలేదు. నీచపు పనులంటే యజమానుల చెప్పలు విప్పడమూ, వాళ్ళ కాళ్లు కడగడమూ మొదలైన కార్యాలు. కనుక నూత్నవేదంలో స్నాపక యోహాను "నేను క్రీస్తు చెప్పలవారు విప్పడానికి గూడ యోగ్యుణ్ణి కాదు" అంటే తాను బానిసకన్న తక్కువవాడని భావం - యోహా 1,27. ఇంకా పేత్రు క్రీస్తుని తన కాళ్లు కడగనీయకపోవడానికి కారణం, ఆ పని యూద బానిసలు కూడ చేయరు. యజమానుల కాళ్లు కడగడం అన్యజాతి బానిసల పని - యోహా 13,6. యూదబానిస చక్కగా భుజించవచ్చు. దుస్తులు తాల్చవచ్చు. పడక మీద పండుకొనవచ్చు. మామూలుగా అతన్నికూడ కుటుంబ సభ్యుణ్ణిగానే గడించేవాళ్లు అతడూ ప్రభువుని ఆరాధించేవాడు. విశ్రాంతిదినాన పని మానుకొనేవాడు, కుటుంబం అర్పించే బలిలో పాలు పొందేవాడు, పాస్మబలి మొదలైన వాటిల్లో పాల్గొనేవాడు. ఒకోమారు అతనికి యజమానుని ఆస్తిలో వాటా వచ్చేది. యజమానునికి సంతానం లేనప్పడు అతడే వారసు కూడ అయ్యేవాడు - ఆది 15,3. అబ్రాహాము బానిసయైన యెలియసేరు యజమానుని కుమారునికి పిల్లను కుదుర్చుకొని రావడానికై పదనారాముకు వెళ్లాడు. అక్కడినుండి రిబ్మాను వెంటబెట్టుకొని వచ్చాడు. అబ్రాహాము ఇతన్ని ఓ కుటుంబ సభ్యునిలాగా ఆదరాభిమానాలతో చూచుకొన్నాడు. కాని అందరు యజమానులూ తమ బానిసలను ఇంతగా ఆదరించివుండరు - ఆది 24.

యూదులు యూదజాతి బానిసలను ఈలా దయతో చూచేవాళ్లు, అసలు ఈ బానిసల బ్రతుకు బానిసంలా వుండేదేకాదు. నిజం చెప్పాలంటే యిస్రాయేలీయులు ఒకరికొకరు బానిసలు కాదు. వాళ్లు ప్రభువుకి మాత్రమే బానిసలు — లేవీ 25,42. యిస్రాయేలీయులను యావే ఐగుప్తనుండి విడిపించుకొని వచ్చాడు. వాళ్ళంతా అతనికి బానిసలు. కనుక ఏ యిస్రాయేలీయుడూ తోడి నరునికి శాశ్వతంగా బానిస కావడానికి వీల్లేదు. ఈలా యూదులు యూద బానిసలను చూచే తీరులో కూడ సాంఘిక న్యాయాన్ని పాటించమంది ధర్మశాస్త్రం. మూడవది, తూకాలు. ప్రభువు పేద ప్రజల కోపు తీసికొనేవాడు. కాని ధనవంతులు దొంగతూకాలతో బక్కవాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. కనుక ధర్మశాస్త్రం దొంగతూకాలను ఖండించి మంచితూకాలను వాడమని హెచ్చరించింది. ఆసబోతులైన ధనవంతులు తమకొక తూకపరాతినీ ఇతరులకు ఇంకొక తూకపు రాతినీ వాడేవాళ్లు. ధర్మశాస్త్రం ఈ మోసాలను ఖండించింది. “ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా రెండు తూకపు రాళ్ళను మీ సంచిలో ఉంచుకోవద్దు. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా రెండు కొలమానాలను