పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/151

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతర దీనప్రజలను ఆదుకోవాలి. ఈ విధంగా పైమూడు వర్గాల నిరుపేదలను పురస్కరించుకొని ధర్మశాస్త్రం సాంఘిక న్యాయాన్ని పాటించమని చెప్తుంది.

2. ఇతరుల హక్కులను మన్నించాలి

యూదులు ఒకరి హక్కులను ఒకరు మన్నించాలని ధర్మశాస్త్రం ఖండితంగా చెప్తంది. హత్యచేయకూడదు, వ్యభిచరించగూడదు, దొంగతనం చేయకూడదు - ఈలాంటి ఆజ్ఞలన్నీతోడి నరుల హక్కులను కాపాడ్డంకోసమే ఉద్దేశింపబడ్డాయి. సొంత ప్రాణమూ, భార్యా వస్తువులూ ఇవన్నీ నరునికి చెందినవి. వాటిమీద అతనికి హక్కు ఉంటుంది. ఆ హక్కుని ఎవరూ భంగం చేయగూడదు. - నిర్గ 20,13-15.

ఎవరి జంతువైనా తప్పిపోతే అవి కనిపంచినవాళ్లు వాటిని మళ్ళాయజమానునికి అప్పజెప్పాలి. "నీ తోడివాడి ఆవూగొర్రే తప్పిపోతూంటే నీవు చూచీచూడనట్లుగా ఉండగూడదు. వాటిని సొంతదారునివద్దకు తోలుకొనిపోవాలి. అతడు నీకు సమీపంలో లేకపోయినా, అసలు అతడెవరో నీకు తెలియక పోయినా, ఆ జంతువులను నీ యింటికి తోలుకొనిరావాలి, యజమానుడు వచ్చిందాకా అవి నీ యింటిలోనే వుంటాయి. అతని గాడిదా పైగుడ్డా జారిపోయినపుడుగూడ నీవు ఈలాగే చేయాలి. అతని వస్తువు ఏది జారిపోయినా ఈలాగే చేయాలి" - ద్వితీ 22:1-4.

దిక్కూ మొక్కూలేని దీనుడికి అందరూ అన్యాయం చేస్తారు. కనుక ధర్మశాస్త్రకారుడు నిరుపేద కూలీలను రక్షించే తలంపుతో ఈ క్రింది నియమం చేసాడు. "పేదకూలివాడ్డి, అతడు స్వజాతీయుడైనాసరే విజాతీయుడైనాసరే, వీడించవదు. సూర్యుడు అస్తమించకమునుపే ఏనాటికూలి ఆనాడు వాడికి ముట్టజెపుతూండాలి. వాడు నిరుపేద గనుక ఆ కూలికోసం కనిపెట్టుకొని వుంటాడు. వాడు నాకు మొరపెడితే నేను మిమ్మ దోషులనుగా గణిస్తాను.” - 24:14-15. ఈ శాసనంలో ఎంత సాంఘిక న్యాయం ఇమిడివుందో ఆలోచించండి!

3. యూదులపట్ల విశేష కరుణ

యూదులు తోడి యూదులపట్ల విశేష కరుణను ప్రదర్శించాలని చెప్మంది ధర్మశాస్త్రం. విజాతీయులకంటె స్వజాతీయులు అధికంగా కరుణింపదగినవాళ్ళు ఇక్కడ వడ్డీ, బానిసలు, కొలతలు అనే మూడంశాలు పరిశీలిద్దాం.

మొదటిది వడ్డీ. "మీరు నా జనుల్లోని ఓ పేదవానికి సొమ్మ అప్పుగానిస్తే వానితో వడ్డీవ్యాపారివలె ప్రవర్తించగూడదు. వానినుండి వడ్డీ పుచ్చుకోరాదు. మీరు మరియొకని నిలువుటంగీని కుదువసామ్మగా తీసికొంటే ప్రొద్దు క్రుంకక మునుపే దాని