పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్తాన్ని సృజించాయి. కనుకనే వాళ్ళ దేవుని చెంతకు రాలేకపోతున్నారు. ప్రజల పాపాలవల్ల ప్రభువు తన ముఖాన్ని మరుగుచేసికున్నాడు - యెష 59, 1-2. ఇది ప్రవక్త బోధ. ఔను, మనం పాపం చేసినప్పుడుకూడ ప్రభువు కోపంతో ముఖాన్ని మరుగు చేసికుంటాడు - కీర్త 30,8.

13. దేవుని యెదుట దుష్కార్యం ఎలా చేయగలను ? - ఆది 39,9.

పూర్వవేద ప్రవక్తలు దేవుడు మన పనులన్నీ గమనిస్తూనే వుంటాడనీ, మనం దుష్కార్యాలు చేసేప్పడు ఆ ప్రభువు సమక్షంలోనే పాపం చేస్తుంటామనీ భావించారు. అందుకే ప్రవక్త యెషయా ప్రభుదర్శనం కలగగానే "సైన్యములకు అధిపతియైన యావేను కన్నులారా చూచాను. నేను అపవిత్రమైన పెదవులు కలవాణ్ణి అయ్యో నశించానుగదా" అనుకుంటాడు - 6,5. అనగా పాపినైన నేను దేవుని యెదుట నిలువదగనని ప్రవక్త భావం. పోతీఫరు భార్య తన్ను నిర్బంధింపగా "దేవుని యెదుట ఈ దుష్కార్యాన్ని ఎలా చేయగలను" అన్నాడు యోసేపు - అది 39,9. సూసన్న ఇరువురు వృద్దులు తన్ను బలాత్కరింపగా "దేవుని యెదుట నే నీ పాపం చేయలేను" అంటుంది - దాని 13.23. ఈలా నరులు భగవంతుని సమక్షంలోనే పాపం చేస్తుంటారనుకోవడం పూర్వవేద ప్రజలకు పరిపాటి. ఈ భక్తుల్లాగే భగవంతుడు సర్వాంతర్యామి, కర్మసాక్షి అతని సమక్షంలో పాపం చేయడం నరులకు శ్రేయోదాయకం కాదు అనుకునేవాళ్ల ధన్యులు.

14. మా యమ్మ నన్ను పాపంలోనే గర్భందాల్చింది = కీర్త 51,5.

ప్రవక్తలు బోధించే మరో భావం, పాపం సర్వత్ర వ్యాపించివుందనడం. వివేకంతో దేవుణ్ణి వెదికే జనమెవ్వరైనా కనిపిస్తారేమోనని యావే ఆకాశం నుండి భూమి మీదకు పరికించి చూచాడు. కాని నరులంతా దారి తొలగివున్నారు - కీర్త 14, 2-3. "పాపం చేయనివాడు ఒకడూ లేడు” అంటుంది మొదటి రాజుల గ్రంథం - 8,46. "తల్లి గర్భంనుండి వెలువడినప్పటినుండే నరుడు పాపం చేయడం మొదలెడతాడు" అంటుంది కీర్తన 58,3. మరో కీర్తనకారుడు "మాయమ్మ పాపంలోనే నన్ను గర్భం దాల్చింది" అంటాడు - 51,5. అనగా తల్లిగర్భాన బడినప్పటి నుండే నేను పాపిని అని కీర్తనకారుని భావం. ۔۔" కొంతమంది పాపాన్ని అట్టే లెక్కచేయరు. సులభంగా పాపం కొట్టుకొంటూంటారు. పాపాన్ని తలంచుకొని అట్టే పశ్చాత్తాప పడరుకూడ. కాని ఈ కీర్తనకారునిలాగ బాల్యంనుండీ నేను పాపిని అని అనుకునేవాడు యథార్థమైన భక్తుడు. 15. నరుని పాపం భగవంతుణ్ణి బాధిస్తుందా ? - యోబు 35, 6 నరుని పాపం భగవంతుణ్ణి బాధిస్తుందా? భగవంతుణ్ణిగాదు నరుణ్ణే బాధిస్తుంది. అందుకే యోబు గ్రంథం "నీవు పాపం జేసినా ఆయనకేమైన కీడు చేయగల్గితివా?"