పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిస్రాయేలు ప్రజల్లో ఏ యోగ్యతా లేకపోయినా ప్రభువు ఆ ప్రజనే యెన్నుకున్నాడు. అందుకు కారణం అతని అవ్యాజ ప్రేమయే - ద్వితీ 7,7-8. ఈ యెన్నిక ద్వారా యిస్రాయేలు ప్రభుప్రజ అయ్యారు - నిర్గ 19,5. అతని ప్రథమ పుత్రుడుగా పరిగణింపబడ్డారు - నిర్గ 4, 22. ప్రభువు యిస్రాయేలును ఫరో దాస్యం నుండి విడిపించి సీనాయి దగ్గిర మోషే ద్వారా వాళ్ళతో ఒడంబడిక చేసుకున్నాడు - నిర్గ 31,8.

కాని ప్రభువు మోషే మధ్యవర్తిగా యిస్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసికుంటూండగానే, వాళ్ళు మాకు ఓ దేవతను చేసిపెట్టమని అహరోనుని కోరారు - నిర్గ 32, 1. ఈలా యిప్రాయేలు విశ్వసనీయుడైన దేవునిపట్ల విశ్వాసఘాతకులుగా ప్రవర్తించారు. దేవుడు వాళ్ళను తనతో నడవ మన్నాడు. కాని వాళ్ళ తమతో నడచివచ్చే బంగారు దేవుణ్ణి చేయించుకున్నారు. యావే ప్రభువును నిరాకరించి తమకు అనుకూలమైన దేవుణ్ణి తయారుచేసికున్నారు. ఆదామేవలు ప్రభువుని ధిక్కరించారు, అతన్ని విశ్వసించలేదు అన్నాం. ఇక్కడ యిప్రాయేలు ప్రజల పాపమూ ఆలాంటిదే - ద్వితీ 97. మనంకూడ పాపంచేసి నప్పడెల్ల ఈలాగే దేవుణ్ణి ధిక్కరిస్తూ వుంటాం.

11. ఈ మన్నా తప్ప మరేమీ దొరకడంలేదు - సంఖ్యా 11,6.

ప్రభువు యిప్రాయేలు ప్రజలకు అద్భుతంగా మన్నాభోజనం సమకూర్చిపెట్టాడు. కాని వాళ్ళకు ఆ మన్నా రుచింపలేదు. ఈజిప్టులో తాము భుజించిన మాంసాన్ని ఉల్లిపాయలను తలంచుకొని మన్నాతో అసంతృప్తి చెందారు - సంఖ్యా 11,4-6, మోషేమీద గొణిగారు, మోషే ప్రభువూ తమ ప్రభువూ ఐన యావేమీద తిరుగుబాటుచేసి ముందుకు కదలమన్నారు. వాళ్ళ అవిధేయతకు కోపించి ప్రభువు ఆదామేవలను శిక్షించినట్లే యిస్రాయేలును కూడ శిక్షించాడు - సంఖ్య 11.33.1 కొరింతీయులు 10, 5-6 లో పౌలు ఈ సంఘటనను పేర్కొన్నాడు. వారిలాగే మనం కూడ చెడ్డ కోరికలు కోరుకోకుండా వుండేందుకు ఈ సన్నివేశం దృష్టాంతంగా వుంటుందన్నాడు.

12. మీ పాపాల వలన ఆయన ముఖం మరుగైంది - యెష59,2.

పూర్వవేద ప్రవక్తలు పాపాన్ని గూర్చి చాలా అంశాలు బోధించారు. కనుక ఈ ప్రవక్తల బోధనలను అవలోకించి పాపాన్ని కొంతవరకైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రవక్తలు నాటి జనుల పాపాల జాబితాలను పొందుపరచారు. యెషయా ప్రవక్త 59 వ అధ్యాయంలో ఈలాంటి జాబితావొకటి కనిపిస్తుంది. నరహత్య అబద్దాలు, మోసపు మాటలు, దౌర్జన్యం, అన్యాయం, వంకరత్రోవలు పట్టడం, చీకటిలో నడవడం, యావేపై తిరుగుబాటు చేయడం - ఈలాంటి పాపాలతో ప్రజలు చెడిపోయారని వ్రాసాడు, ప్రభువు ప్రజలను రక్షింపలేకగాదు. కాని ప్రజల పాపాలు దేవునికీ తమకూ మధ్య ఓ అగాధ