పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. వారాయన కంటికి కనపడకుండ దాగుకున్నారు - ఆది 3,8

దేవుడు నరుణ్ణి శిక్షింపకముందే పాపం దుష్ఫలితాన్ని ఈయనే ఇచ్చింది. నరునికి దేవునితోగల బాంధవ్యం తెగిపోయింది. అంతకుముందు ఆదామేవలిద్దరూ దిసమొలతోనే వుండేవాళ్ళ దిసమొలతోనే దేవునిచుటూ తిరిగేవాళ్ళు, కాని పాపం కట్టుకున్న వెంటనే ఆదామేవలకు మొండిమొలతో వున్నామని తెలిసిపోయింది. ఇక వాళ్ళకు దేవునితో నడవడానికి సిగ్గు వేసింది. భయం కలిగిందికూడ కనుకనే దేవుని యెదుటబడలేక చెట్లనడుమ దాగుకున్నారు -2, 8-10.

ఆ పండు తింటే మీకు కనువిప్ప కలుగుతుంది అంది సర్పం - 3,5, నిజమే. వాళ్ళకు కనువిప్ప కలిగింది. కాని ఆదామేవలు కండ్లవిప్పి చూచుకునేప్పటికల్లా తమ గొప్ప తనాన్నిగాదు, దిసమొలను మాత్రమే గుర్తింప గలిగారు! వాళ్ళు తమ అల్పత్వాన్ని తెలిసికున్నారు. అవమానంతో క్రుంగిపోయారు, దేవుడు ఆదిమానవులను శపించాడు, మరణమూ, వనబహిష్కారమూ ఆ శాప ఫలితాలే - 8,23. ఆనాటినుండి నరుడు దేవునికి దూరమయ్యాడు. ఈలాగే మనలను గూడ పాపం దేవుని నుండి దూరం చేస్తుంది.

5. మట్టినుండి పుట్టావు కనుక మట్టెపోతావు → ఆది 3, 19. పాపమే చేయకపోయినటైతే ఆదామునకు చావంటూ వుండేదికాదు. పాప ఫలితంగా అతనికి మరణమనే శీక్ష సంక్రమించింది. కాని యేమ్మరణం? శారీరక మరణమూ, ఆత్మ మరణమా? రెండూ అని చెప్పాలి. అనగా ఆదాము భౌతికంగా చనిపోయాడు. ఆ మీదట దైవ సాన్నిధ్యాన్ని కూడ కోల్పోయాడు.

జ్ఞానగ్రంథకర్త ఆదాము పాపాన్నిస్మరించుకుంటూ “దేవుడు నరుణ్ణి అక్షయుడుగా వుండడంకోసం సృజించాడు. కాని పిశాచం అసూయవలన మరణం లోకంలోనికి ప్రవేశించింది" అని వ్రాసాడు - జ్ఞాన 2, 24. ఇక్కడ అక్షయుడుగా వుండడమంటే చనిపోకుండా వుండడమూ, శాశ్వతంగా దైవసాన్నిధ్యాన్ని అనుభవించడంగూడ, పాపం వలన ఆదాము ఈ రెండు భాగ్యాలనూ కోల్పోయాడు.

పౌలు కూడ పై ఆదికాండనూ, జ్ఞానగ్రంథాన్నీ మనసులో పెట్టుకొనే “వో మనుష్యుని ద్వారా పాపమూ పాపం ద్వారా మరణమూ లోకంలోకి ప్రవేశించాయి" అని వ్రాసాడు - రోమా 5,12. ఇక్కడ మరణమనగా భౌతిక మరణమూ, ఆ మీదట శాశ్వతమైన ఆత్మమరణమూను. తరువాత పునీత అగస్తీను పై వేదవాక్యాలమీద వ్యాఖ్య వ్రాస్తూ దేవుడు ఆదామునకు ఏమిమరణం విధించాడని ప్రశ్న వేసికొని దేహమరణం, ఆత్మమరణం రెండూనని జవాబిచ్చాడు. అనగా శాశ్వతంగా జీవింపవలసిన ఆదాము దైవ కృపను కోల్పోయాడు గనుక యిక మరణిస్తాడు. మరణించిన పిదప దైవసాన్నిధ్యాన్నీ దైవదర్శనాన్నీ పొందలేడు. ఆదాము పొందిన యీ శిక్షనే పాపం చేసినప్పుడెల్ల మనమూ పొందుతూంటాం.