పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐక్యమౌతారు. చెట్టతో ఐక్యమైన కొమ్మలన్నీ శిరస్సుతో ఐక్యమైన అవయవాలన్నీ మందిరంతో ఐక్యమైన రాళ్ళన్నీ పరస్పర సంబంధం కలిగివుంటాయికదా! ఆలాగే క్రీస్తుతో ఐక్యమైన మనమందరమూ పరస్పర సంబంధం కలిగి వుంటాం. కనుక మన ప్రేమకు కారణము క్రీస్తే, దానికి విలువనిచ్చేదీ క్రీస్తే


4. సోదరప్రేమను పెంపునకు గొనివచ్చేది దివ్యసత్రసాదం

మన మందరము ఒకే రొట్టెలో పాలుపంచుకొని ఆ వొకే రొట్టెద్వారా అనేకుల మైన మన మందరమూ ఒకే దేహంగా ఏర్పడుతున్నాం -1కొ 10,17. దివ్యసత్రసాదం మనలను క్రీస్తుతోను తోడి ప్రజలతోను ఐక్యపరుస్తుంది. దీని ద్వారా జాతి వర్గ లింగ భేదాలను అతిక్రమించి ఏకైక క్రీస్తు శరీరంగా, ఏకైక క్రైస్తవ సమాజంగా మారిపోతున్నాం. అంతా అన్నదమ్ములమూ అక్కచెల్లెళ్ళమూ ఔతున్నాం. కనుక మనం దివ్యసత్రసాదాన్ని యోగ్యంగా స్వీకరిస్తూ సోదరప్రేమను వృద్ధిచేసికొంటూండాలి.

5. సోదరప్రేమకు ప్రబల శత్రువు స్వార్ధప్రేమ


స్వార్ధప్రేమవల్ల ఇతరులను అణచివేసి మనం పైకి రాగోరుతూంటాం. స్వార్ధమున్నకాడ సోదరప్రేమ వుండదు. అంచేత స్వార్ణాన్ని జయిస్తేనేగాని సోదరప్రేమను సాధించలేం. అందుకే క్రీస్తు కూడ “నన్ను వెంబడింప గోరేవాడు తాన్నతాను నిరాకరించుకొని తన సిలువను మోసికొంటూ నా వెంట రావాలి" అన్నాడు - మత్త 16.24. తన్ను తాను నిరాకరించుకొనందే, స్వార్ణాన్ని అణచివేసికోండే, సోదరప్రేమ అలవడదు. స్వార్థ మానవుడు ప్రేమమానవుడు కాజాలడు.

6. మనం సాధించవలసిన ప్రధానకార్యం సోదరప్రేమ

 మామూలుగా క్రైస్తవ సాధకులు రకరకాల ప్రేషిత కార్యాల్లో నిమగ్నులౌతూంటారు. రకరకాల సత్కార్యాలు చేసి వివిధ పుణ్యాలు ఆర్థిస్తూంటారు. కాని అన్నిటికంటే ప్రధానమైన పుణ్యం సోదరప్రేమ. ఈ లోకంలో మనం దేన్ని సాధించినా, దీన్ని సాధించలేకపోతే ప్రయోజనం లేదు. అందుకే పౌలు కొలోసీయులకు వ్రాస్తూ "అన్నిటి కంటే మిన్నగా ప్రేమను సాధించండి. ఈ ప్రేమ అన్ని పుణ్యాలనూ పరిపూర్ణంగా ఐక్యపరుస్తూంది" అని చెప్పాడు - 3,14. అనగా అన్ని పుణ్యాలూ సాధిస్తే ఎంతో ప్రేమను సాధిస్తే అంత. దానికి మించిన పుణ్యమంటూ లేదు. తరుచుగా మనం సోదర ప్రేమను లెక్కచేయం. ఏదో పేషిత కార్యాన్ని సాధింపగోరి దీక్షతో కృషిచేస్తుంటాం. కాని ఈ కృషికి దాసులమైపోయి, ఈ కృషిలోనే సోదర ప్రేమను భంగపరుస్తూంటాం. ఇది పెద్ద పొరపాటు. అన్ని సత్కార్యాల కంటే సోదరప్రేమ గొప్పది అన్నాం. అది అన్నిటికంటే గొప్ప పుణ్యం కనుక, అన్ని పాపాల కంటే సోదర ప్రేమకు వ్యతిరేకంగా జేసే పాపాలే గొప్పవి. కనుక క్రైస్తవ సాధకుడు బహుజాగరూకతతో ఈ పుణ్యాన్ని సాధించాలి.