పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/90

ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుతోపాటు మనమూ పాపానికి చనిపోతాం. అతనితోపాటు నూత్నజీవితానికి ఉత్తానమౌతాం. ఈ మరణమూ ఉత్తానమూ మన జ్ఞానస్నానంలో సాంకేతికంగా జరుగుతాయి. కనుకనే ప్రాచీన కాలంలో ఉత్తాన దినాన విశేషంగా జ్ఞానస్నానం ఇచ్చేవాళ్లు. జ్ఞానస్నానంద్వారా మనం ప్రభువు మరణోత్తానాల్లో పాల్గొంటామని తెలియజేసేవాళ్లు - రోమా 6,3-11. ఈలా మనం ఏటేట ఉత్తాన పండుగను చేసికొంటూ క్రీస్తు పాస్కను నూతీకరిస్తూ పోతాం. అన్ని ఆదివార ఆరాధనలకంటెగూడ అధికంగా ఈ ఉత్తాన ఆదివారపు ఆరాధనం మనలను పవిత్రపరుస్తుంది.

3. మోక్షపు పాస్క:

క్రీస్తు వధింపబడిగూడ సజీవుడై యున్న గొర్రెపిల్ల అంటుంది దర్శనగ్రంథం - 5,6. అనగా అతడు ఉత్దానక్రీస్తు. మనం మోక్షంలో ఈ గొర్రెపిల్లను చేరుకొంటాం. ఆ ప్రభువుతోపాటు మోక్షపు విందులో పాలుపొందుతాం. అదే మన పాస్క - మత్త 26,29. మనం ఈ లోకంనుండి స్వర్గానికి యాత్ర చేసేవాళ్లం. ఇక్కడినుండి మోక్షానికి దాటిపోయేవాళ్ళం - హెబ్రే2,22-24. మొదటి పేత్రు జాబుకూడ మనం ఈ లోకంలో యాత్రికుల్లాగ జీవించాలి అని చెప్తుంది. అనగా మనం స్వర్గానికి యాత్ర వెళ్ళేవాళ్ళం. అక్కడ కడపటి పాస్క చేసికొనేవాళ్ళం - 1 పేత్రు2:11.

ఈ యధ్యాయంలో పాస్కనుగూర్చి చాల విషయాలు చూచాం. ఐగుప్తులో ప్రారంభమైన ఈ పాస్క మోక్షంలో ముగుస్తుంది. పాస్కబలి క్రైస్తవ జీవితంలో ముఖ్యాతి ముఖ్యమైన అంశం.

4 యుద్ధమూ, సముద్రోత్తరణమూ

బైబులు యిస్రాయేలును ప్రభుసైన్యంగా భావిస్తుంది - నిర్గమ 12,41. ప్రభువే ఈ సైన్యానికి అధిపతి. యిప్రాయేలు ప్రభువుని అనుభవానికి తెచ్చుకొంది ఒక్క ఆరాధనలోనేగాదు, యుద్ధంలో గూడ. అతడు యిస్రాయేలు తరఫున పోరాడే వీరుడు. వాళ్ళ శత్రువులను హతమార్చే యోధుడు. దావీదురాజు కాలంనుండి యుద్ధం రాజుల వంతయింది. అంతకుముందు అది యావే వంతు. ఈ అధ్యాయంలో ప్రభువు ఐగుప్రీయులతో పోరాడి వాళ్ళను నాశంచేసి తన భక్తులైన యిస్రాయేలీయులను రెల్లసముద్రం దాటించడాన్ని గూర్చి ఆలోచిద్దాం. ఈ వదంతం నిర్గమకాండం 14వ అధ్యాయంలో వస్తుంది.