పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/85

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విమోచనం ద్వారానే యిస్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. అతనికి యాజకరూపమైన రాజ్యమూ, పవిత్రప్రజా, సొంతజనమూ అయ్యారు - 19, 5-6. ప్రభువు వాళ్ళను ప్రేమతో ఎన్నుకొన్నాడు గూడ - ద్వితీ 7, 6-8

యూదులకు ఐగుప్న మొదటి ప్రవాసమైతే బాబిలోను రెండవ ప్రవాసం. కనుక ప్రవక్తలు పైవిమోచనాన్ని బాబిలోను ప్రవాసానికి గూడ అన్వయింపజేసారు. కనుకనే యెషయా బాబిలోనులో ఖైదీలుగా వున్నయూదులకు ప్రభువు విముక్తి ప్రసాదిస్తాడని ప్రవవచించాడు. ఈ విముక్తి భర్త తాను పరిత్యజించిన భార్యను మళ్ళా చేపట్టినట్లుగా వుంటుందని చెప్పాడు - 54, 5–10

ఇంకా కొందరు ప్రవక్తలు ప్రభువు విమోచనాన్ని మెస్సీయా కాలానికి గూడ వర్తింపజేసారు. ఇదే నూత్నవేద విమోచనం. “ఈ దినాలు గడచిన తర్వాత నేను ప్రజల హృదయాల మీద నా యాజ్ఞలు లిఖిస్తాను” అంటాడు యిర్మీయా - 31, 33–34 పూర్వవేద ఆజ్ఞలు రాతిపలక మీద వ్రాయబడ్డాయి. మెస్సీయా కాలంలో ప్రభువు ఆజ్ఞలు నరుల హృదయాల మీదనే వ్రాయబడతాయి అని భావం, “ఆ రోజుల్లో మీకు నూత్న హృదయాన్నీ నూత్న స్వభావాన్నీ ప్రసాదిస్తాను. మీలోని రాతి గుండెను తొలగించి దానిస్థానే మాంసపగుండెను నెలకొల్పుతాను” అంటాడు యెహెజ్కేలు – 36, 26–27. ఇక్కడ రాతిగుండె అవిధేయతకీ మాంసపుగుండే విధేయతకీ చిహ్నాలు. ఈ ప్రవచనాలన్నీ నూత్న వేదంలో క్రీస్తు ప్రసాదించబోయే విమోచనాన్ని సూచిస్తాయి.

3. క్రీస్తు విమోచకుడు

యిర్మియా యెహెజ్కేలు వంటి ప్రవక్తల ప్రవచనాలు నెరవేరి యేసు ప్రభువు విజయంచేసాడు. యావే పూర్వవేద విమోచకుడైతే యేసు నూత్న విమోచకుడు. కనుకనే అతడు “మనుష్యకుమారుడు సేవలు చేయించుకొనడానికి గాదు, సేవలు చేయడానికే వచ్చాడు. అనేకుల రక్షణం కోసం అతడు తన ప్రాణాలను క్రయధనంగా వెచ్చిస్తాడు" అని పల్మాడు - మార్కు 10,45, ఈలా ప్రాణాలను వెచ్చిండమే విమోచనం.

పూర్వవేద విమోచనానికీ నూత్నవేద విమోచనానికీ చాలా పోలికలున్నాయి. అక్కడ ప్రజలు ఫరోకు దాసులు. ఇక్కడ పిశాచానికీ పాపానికీ దాసులు. యూదులు రెల్లసముద్రం దాటారు. మనం దాటే సముద్రం జ్ఞానస్నానమే. ఆనాడు ప్రభువు సీనాయి కొండమీద యూదులతో నిబంధనం చేసికొన్నాడు. ఈనాడు అతడు జ్ఞానస్నానంద్వారానే మనతో నిబంధనం చేసికొంటాడు. యూదులు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. మనం చేరుకొనే వాగ్దత్తభూమి మోక్షమే. అక్కడ ప్రజలను నడిపించిన నాయకుడు మోషే, నూత్నవేద