పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది



5. నిర్గమం

బైబులు భాష్యం - 36

విషయసూచిక

1. యావే దివ్యనామం 73

2. ప్రభువు విమోచకుడు 76

3. పాస్క . 79

4. యుద్ధమూ, సముద్రోత్తరణమూ 82

5. నిబంధనం 86

6. ఎడారి 90

7. సాన్నిధ్యం 95

8. మహానాయకుడు మోషే 98

9. ఆదిపంచకమూ, నాలు సంప్రదాయాలూ 101.

1. యావే దివ్యనామం

1. యావే ఉండేవాడు

యిస్రాయేలు ప్రజలకు యావే అంటే మహాగౌరవం. భయంకూడాను. అందుచేత అతని పేరుకూడా ఉచ్చరించేవాళ్ళు కాదు. పూర్వవేదంలో యావే అనేపేరు వచ్చినపుడెల్లా వాళ్ళు "అదొనాయి" అని చదివేవాళ్ళు అదొనాయి అనే అరమాయిక్ మాటకు ప్రభువు అని అర్థం. కనుక యావే అంటేకూడ ప్రభువు అనే అర్థమే రూఢమైపోయింది. గ్రీకు లాటిను అనువాదాలు కూడ యావే అనేమాటకు ఈ యర్దాన్నే స్వీకరించాయి. కాని యావే అనే పేరునకు ప్రభువు అని అర్థంకాదు. మరేమిటి?

నిర్గమకాండ 3,14లో యావే మోషేతో "యేహ్యే అషేర్ యేహ్యే" అంటాడు. ఈ హీబ్రూ మాటలకు "నేను ఏ వున్నవాడనో అతనినే" అని భావం. "హయ్యా" లేక "హవ్వా' అనే హీబ్రూ ధాతువునుండి "యేహ్యే" అనే క్రియా రూపం ఏర్పడుతుంది. హయ్యా అంటే ఉండడం లేక అవడం. కనుక ఈ మూలధాతువు నుండి పట్టే యావే అనే శబ్దానికి “ఉండేవాడు" లేక “అయ్యేవాడు" అనిభావం. కాని ఏమి వుండడం?

2. రక్షణాత్మకంగా ఉండేవాడు

నరుడు నరునితో ఉంటుంటాడు. నరుడు నరుని ప్రక్కనే కూర్చుండి మాటలాడతాడు. కాని నరుని ఉనికివలన నరునికి కీడూ కలుగదు. మేలూ కలుగదు.