పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

కొట్టింది" అనుకొని బాధపడ్డారు - 42,21. సోదరులు యోసేపని కలసి కోవడం హృదయాన్ని కదిలించే సంఘటనం. బైబుల్లోని గొప్పఘట్టాల్లో వొకటి.

అన్నలు తాము కొన్న ధాన్యానికి చెల్లించవలసిన సొమ్మును యోసేపు వారివారి గోతాలలోనే పెట్టించాడు. అతడు సోదరులకు దారిబత్తాలు ఇప్పించాడు. కనుక వారికి దారిలో గోతాలను విప్పవలసిన అవసరం కలగలేదు. ఇంటికి వెళ్లి సంచులు విప్పగా ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లోనే కన్పించింది. అది చూచి వాళ్లు వణకిపోయారు. ఈజిప్టు అధికారి వాళ్లతో పరుషంగా మాటలాడి వారిని చెరలో త్రోయించాడు కదా! ఆలాంటివాడు తమ సొమ్మును తిరిగి ఇచ్చివేస్తాడా? ఇక్కడ యేదో కుట్రవుండాలి అనుకొని భయపడ్డారు. దిగులు చెందారు - 42, 35.

రెండవసారి సోదరులు యోసేపని దర్శించడం

సోదరులు మొదటిసారి తెచ్చుకొన్న ధాన్యం ఐపోయింది. వాళ్ళు రెండవసారి ధాన్యానికి వచ్చారు. యాకోబు చాల అనిష్టంగానే బెన్యామీనును వాళ్లవెంట పంపాడు. అదీ యూదా కడగొట్టు తమ్మునికి పూటపడిన తర్వాతనే. బెన్యామీను రాహేలుకి పట్టినవాడు కనుక యోసేపకి సొంత తమ్ముడు. ఇతడు పుట్టగానే తల్లి చనిపోయింది. ఇతడు యోసేపు ఇల్లు వీడివచ్చిన తర్వాత పుట్టాడు. కనుక అతడు తమ్ముణ్ణి చూడ్డం ఇదే మొదటిసారి. అతన్ని చూడగానే యోసేపుకి కన్నుల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. వెలుపలికి వెళ్లి వెక్కివెక్కి యేడ్చాడు. ఈలాంటి గొప్ప ఘట్టాలు ఈ కథలో చాలవున్నాయి - 48,30.

యోసేపు అన్నలకు ఇంకా యొక్కువ పశ్చాత్తాపం పుట్టింపగోరాడు. అతడు తాను పానీయం సేవించే గిన్నెను బెన్యామీను గోత్రంలో పెట్టించాడు. సోదరులు ధాన్యం తీసికొని నగరంవీడి పొలిమేర వరకు వెళ్లాక వారి గోతాలు సోదాచేయించాడు. బెన్యామీనుపై నేరంమోపి అందరినీ తిరిగి తన చెంతకు రప్పించాడు. మేలు చేసినవారికి కీడు చేస్తారా అని వారిని చీవాట్లు పెట్టాడు. ఈ సందర్భంలో యూదా యోసేపుకి చేసిన మనవి ఒక్క బైబుల్లోనే కాక ప్రపంచ సాహిత్యంలోనే మణిపూస లాంటిది. పాఠకులు ఈ ఘట్టాన్ని పలుసార్లు చదువుకోవాలి -44, 16-34.

యోసేపు తన్ను ఎరుకపరచుకోవడం

బెన్యామీను గోతంలో దొరికిన గిన్నె కారణంగా సోదరులు ఇరకాటంలో పడి బిక్కమొగం వేసికొని నిలబడ్డారు. యూదా కడగొట్టు తమ్మునికి తాను పూటపడతాననీ, అతనికి బదులుగా తాను చెరలో వుంటాననీ, తమ్ముని తండ్రివద్దకు పంపివేయమనీ విన్నవించుకొన్నాడు. యోసేపు దుఃఖం ఆపుకోలేకపోయాడు. అతడు సేవకులందరినీ