పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/74

ఈ పుట ఆమోదించబడ్డది

ఫరో కలలు

ఈ కథలోమొత్తం ఆరు కలలు వస్తాయి. ఇవి జంటలుగా వస్తాయి. యోసేపు వీటికి అర్థం చెప్తాడు. ఈ కలలు దైవదర్శనాలు కాదు. కాని యివి దేవుడు భవిష్యత్తులో నిర్ణయించిన కార్యాలను ముందుగానే సూచిస్తాయి. హెబ్రేయుల కంటె యిూజిప్టు ప్రజలు స్వప్నశాస్రాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసారు. ఈ కథలోని కలలు ఈజిప్టు ప్రజల స్వప్నసంస్కృతిని తెలియజేస్తాయి.

ఫరోకు రెండు కలలు వచ్చాయి. మొదటి దానిలో అతడు నైలునదివొడ్డున బక్కచిక్కిన ఏడావులు బలిసిన ఏడావులను మ్రింగివేయడo చూచాడు. రెండవ దానిలో ఏడు గట్టికంకులు ఏడు పీలకంకులను బ్రిమింగివేయడం చూచాడు. మరునాడు రాజు ఈ కలల భావాన్ని తెలియజేయండని తన జ్ఞానులను అడిగాడు. కాని వాళ్లు వాటి అర్ధాన్ని వివరించలేకపోయారు. హీబ్రూజ్ఞానం ముందు ఈజిప్టు జ్ఞానం తలవంచకతప్పదని ఇక్కడ రచయితభావం.

ఫరో ఈ కలలు ఏదో అనర్గాన్ని సూచిస్తున్నాయని భయపడ్డాడు. అప్పడు పానీయవాహకుడికి తెలివివచ్చింది. అతడు యోసేపు పూర్వం తన కలకు అర్థం చెప్పిన తీరును రాజుకు తెలియజేసాడు. అతన్ని పిలిపింపమని వేడుకొన్నాడు. రాజు యోసేపును పిలువనంపగా అతడు ఆ కలల భావాన్ని ఈలా వివరించాడు. ఈజిప్టులో మొదట ఏడేండ్లు పంటలు బాగా పండుతాయి. ధాన్యం సమృద్ధిగా లభిస్తుంది. కాని తర్వాత ఏడేండ్లు దారుణమైన కరవు వస్తుంది. ప్రజలు తిండిలేక మలమలమాడి చస్తారు. అందుచే రాజు ముందుగానే వివేకమూ ఉపాయమూగల అధికారిని నియమించాలి. ఆ ఉద్యోగి పంటలు బాగా పండిన ఏడేండ్ల కాలంలో ధాన్యాన్ని ప్రోగుజేసి ఆయానగరాల్లో నిల్వజేయించాలి. కరవు కాలంలో ఆ గింజలను ప్రజలకు పంచిపెట్టాలి. అలాచేస్తే దేశం కరవుకి బలికాకుండా వుంటుంది. యోసేపు తన సొంత శక్తితో కాక దైవజ్ఞానంతో ఈ కలలకు అర్థం చెప్పాడు - 41, 16. ఇక్కడ ఏడు అంటే కచ్చితంగా ఏడేండ్లని అర్థంకాదు. కొంతకాలంపాటు అని మాత్రమే భావం.

యోసేపు వ్యాఖ్యానమూ సలహా చక్రవర్తికీ అతని కొలువుకాళ్లకూ నచ్చాయి. ఫరో అతన్ని దైవప్రభోధితుడు అని మెచ్చుకొన్నాడు. అతడు దేవునియాత్మ తనయందు కలవాడు—41,38. ఫరో అతనికి మించిన వివేకి ఉపాయశాలి లేడని యెంచి కరవకాలానికి ధాన్యాన్ని నిల్వచేసే అధికారాన్ని అతనికే ఒప్పజెప్పాడు. అతన్ని దేశంలో తన తర్వాత