పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

అసలు ఈ యారురోజుల సృష్టి లేనేలేదు. అక్కడ దేవుడు ఒకరోజులోనే సృష్టిఅంతా ముగించాడు - 2,4. ఇంకోసంగతి కూడ. దేవుడు మొదటిరోజున వెలుగును కలిగించాడనీ, నాల్గవ రోజున సూర్యుణ్ణి కలిగించాడనీ చెప్తుంది యాజక సంప్రదాయం. ఇదే నిజమైతే సూర్యుడు లేకమందే వెలుగెలావచ్చింది? కనుక మనం ఈయారురోజుల సృష్టి అక్షరాల నమ్మవలసిన అవసరంలేదు. మరి యాజక సంప్రదాయం దేవుడు ఆరురోజులపాటు సృష్టిచేసికొంటూ వెళ్లాడని చెప్పడం దేనికి?

3. విశ్రాంతి దినము

దేవుడు ఆరు రోజులు పని చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసికొన్నాడు - 2,7. యాజకులకు ఈ విశ్రాంతి దినమంటే మాలావు గౌరవం. దేవుడే ఆరు రోజులు పని చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసికొంటే, నరుడు కూడ ఏడవ రోజు విశ్రాంతి తీసికోవాలని చెప్పడం కోసం యాజకులు పైయారురోజుల సృష్టిని వర్ణించారు. నిర్గమ కాండం "ప్రభువు ఆరు రోజులు కృషి భూమ్యాకాశాలనూ సముద్రాన్నీ వాటిలో వుండే ప్రాణికోటినీ సృజించాడు. ఏడవ రోజు విశ్రాంతి తీసి కొన్నాడు. అతడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పవిత్రపరచాడు" అని చెప్తుంది - 20,11. ఈలాంటి పవిత్ర దినాన్ని నరులు కూడా పవిత్రంగా భావించాలి అని యాజకుల ఉద్దేశం. ఈ విశ్రాంతి దినం ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కాణించడం కోసమే యాజకులు ఆరు రోజుల సృష్టిని ఊహించారు. అసలు ప్రభువు ఓక్షణంలోనే, ఓచిన్న తలంపుతోనే సృష్టినంతటినీ చేసాడు. ఇక, యూదులు శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటించేవాళ్లు. మనకు ఆదివారం విశ్రాంతి దినం. కనుక వాళ్లు ఆ శనివారాన్నిలాగే మనం ఆదివారాన్ని పవిత్ర దినంగా భావించాలి .అది ప్రభువు ఉత్తానమైన రోజు.

4. వ్యత్యాసాలు

ఆదికాండములోని తొలి మూడధ్యాయాలూ యాజక యావే సంప్రదాయాలనే రెండు భిన్న సంప్రదాయాలకు చెందిన రచనలని చెప్పాం. ఈరెండు సంప్రదాయాలూ సృష్టి గురించే చెప్పినా వాటి దృక్పథంలో మాత్రం చాలా భేదంవుంది. 1. యాజక సంప్రదాయం ప్రపంచపు సృష్టితో ప్రారంభమౌతుంది. దేవుడు ప్రపంచాన్ని ఏలా కలిగించాడు అన్నది ఇక్కడ ముఖ్యం. యూవే సంప్రదాయం నరుని సృష్టితో ప్రారంభమౌతుంది. దేవుడు చేసిన నరుడు ఏలాంటివాడు అన్నది ఇక్కడ ముఖ్యం. 2. యాజక సంప్రదాయంలో విశ్రాంతి దినం ప్రధానమైతే యావే సంప్రదాయంలో నరుడు ఆడుది మగవాడుగా కలిగింపబడ్డాడు అన్నది ముఖ్యం. 3. అక్కడ దేవుడు తన