పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది

పాలస్తీనా దేశానికి తిరిగివచ్చాక 6వ శతాబ్దంలో పాటించిన ఆరాధన నియమాలను చెప్తుంది. కాని ఈ నియమాలన్నీ మోషే ధర్మశాస్త్రం నుండే ప్రేరణాన్ని పొందాయి. కనుకనే ఈ పుస్తకాన్ని మోషే గొప్పతనానికి అద్దంపట్టే ఆదిపంచకంలో చేర్చారు. ఈ పుస్తకంలోని నియమాలు అంతశుద్ధినిగాక శరీరశుద్ధినే ఎక్కువగా ప్రస్తావిస్తాయి. ఈ గ్రంథంలో చరిత్ర యేమీవుండదు. అందుచే చదవడానికి విసుగు పడుతుంది.

సంఖ్యాకాండం

ఎడారిలో ప్రయాణం చేసేపుడు మోషే యిస్రాయేలీయుల జనాభాలెక్కలు సేకరించాడు. కనుకనే దీనికి సంఖ్యాకాండం అని పేరు. ఈ గ్రంథం ప్రజలు సీనాయి కొండనుండి కాడేషుమీదిగా ఎడారిలో ప్రయాణం చేయడాన్ని వర్ణిస్తుంది. లేవీయకాండంలోని నియమాలు దీనిలోకూడ కన్పిస్తాయి. ఐనా ఈ గ్రంథం ఎడారిలో జరిగిన వివిధ సంఘటనలతో ఆసక్తికరంగానే వుంటుంది

ద్వితీయోపదేశ కాండం

ప్రభువు సీనాయికొండదగ్గర మొదటిసారిగా ప్రజలకు ధర్మశాస్తాన్ని లేక ఉపదేశాన్ని దయచేసాడు. ఈ వపదేశాన్నే మోషే ఎడారిలో తిరిగి రెండవసారి ప్రజలకు విన్పించాడు. కనుకనే దీనికి ద్వితీయోపదేశం అనిపేరు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దికల్లా యూదులు ధర్మశాస్తాన్ని ఉపేక్షించడం మొదలుపెట్టారు. కనుక ఆనాటి రచయితలు దాని విలువను నొక్కిచెప్పవలసివచ్చింది. వాళ్ళు ఈ పుస్తకంద్వారా ధర్మశాస్తాన్ని మళ్ళా సజీవం చేసారు. పుస్తకమంతా ధర్మశాస్తాన్ని గురించే చెప్తుంది. దానిమీద వివరణం చెప్తుంది. మంచి భాషలో, చాల భక్తిమంతంగా వుంటుంది.

2. చారిత్రక గ్రంథాలు

ఈ శాఖకు చెందిన గ్రంథాలు యూదుల చరిత్రను చెప్తాయి. హీబ్రూ బైబులు వీటిని "పూర్వ ప్రవక్తల గ్రంధాలు" అని పిలుస్తుంది. అంటే ఈ పుస్తకాల్లో వచ్చే సంగతులు కేవలం చారిత్రకాంశాలు కాదనీ, ఈ చారిత్రకాంశాలద్వారా ప్రభువు తన చిత్తాన్నీ రక్షణ ప్రణాళికనూ ప్రజలకు తెలియజేసాడనీ భావం. వీటిలో యోషువా, న్యాయాధిపతులు, సమూవేలు గ్రంధాలు రెండు, రాజుల గ్రంథాలు రెండు మొదట ఏకగ్రంథంగానే వుండేవి. కాలక్రమేణ విభజింపబడ్డాయి. ఇక ఈ వర్గంలో ఒక్కో పుస్తకాన్ని గూర్చి విచారిద్దాం.

యోషువా

మోషే గతించిన తర్వాత అతని యనుచరుడైన యోషువా యిప్రాయేలీయులకునాయకుడై 1250 ప్రాంతంలో వాళ్ళను వాద్దత్తభూమికి చేర్చాడు. కనానీయులనుండి