పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/304

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరులు ఒకరినొకరు అర్థంజేసికొని ఆవేశకావేషాలను వదలించుకొంటారు. కనుక నాయకులు సంప్రతింపులు జరిపించాలి.

మొదట మన హృదయంలో శాంతి లేనిదే ఇతరులకు శాంతిని నేర్పలేం. కనుక శాంతిస్థాపకులు మొదట తమ హృదయాల్లోని అశాంతిని తొలగించుకోవాలి. అనగా మన దురాశలనూ స్వార్దాన్ని అణచుకోవాలి. గాంధీ, మార్టిన్ లూధర్ కింగ్ మొదలైన నాయకులు మొదట తమ హృదయాలను పునీతం జేసికొని ఆ పిమ్మట దేశంలో శాంతిని స్థాపించారు.

మన హృదయాలకు శాంతినిచ్చేవాడు ప్రధానంగా ప్రభువే. అతడు నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని ఈయడంలేదు. మీరు కలవర పడకండి" అన్నాడు - యోహా 14,27. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైంది. తరచుగా లౌకిక రంగానికి చెందింది. కాని క్రీస్తు శాంతి ఆధ్యాత్మిక మైంది, శాశ్వతమైంది. అది ప్రధానంగా పాపపరిహారంద్వారా లభిస్తుంది.

పౌలు భక్తుడు 'శాంతి నొసగే దేవుడు మీకు శాంతిని ప్రసాదించునుగాక” అని తన సమాజాలను ఆశీర్వదిస్తుండేవాడు -1 తెస్స 5,23. నేడు మన సమాజాలకూ ప్రజలకూ గూడ శాంతి అత్యవసరం. మన తరపున మనం ఎప్పడూ శాంతిని కోరాలి. ప్రజలను ఐక్యపరచాలి గాని విభజించకూడదు. తగాదాలు పెట్టి తమాషాలు చూడకూడదు. ఎప్పడూ మన హృదయాన్ని క్రీస్తు ప్రేమతో, శాంతితో నింపుకోవాలి. ఇతరుల హృదయంకూడ అలాగే వుండాలని కోరుకోవాలి. మనం దుఃఖాన్ని భరించలేం గదా! అలాగే ఇతరులను గూడ దుఃఖపెటట్టకూడదు. అందరూ సుఖంగా, క్షేమంగా వండాలని కోరుకోవాలి. "ప్రభూ! నేను నీ శాంతిని పెంపొందించేలా చేయి" అని ప్రార్ధించాడు అసిస్సీ ఫ్రాన్సిస్ భక్తుడు.

8. హింసితులు - దైవరాజ్యం

8వ ధన్యవచనాన్ని 10వ చరణంలో ఒకసారి, 11-12 వచనాల్లో ఇంకోసారి చెప్పారు. కాని ఈ రెండు ఒకే ధన్యవచనం. ఇక్కడ “ధర్మార్థం" అంటే రక్షణం కొరకు అని భావం. కావున నాల్గవ ధన్యవచనంలోని నీతి, 8వ దానిలోని ధర్మం ఒకటే. కనుక మన రక్షణాన్ని పరస్కరించుకొని, అనగా క్రీస్తు కొరకు, మన విశ్వాసం కొరకు వేదహింసలకు గురైతే ధన్యులు మౌతామని భావం.

మత్తయి ఈ సువిశేషం వ్రాసేనాటికి క్రైస్తవులు యూదుల నుండి చీలిపోయారు. కనుక యూదులు క్రైస్తవులను తమ ప్రార్థనా మందిరాలకు రానీయలేదు. వారిని నానావిధాల హింసించారు. ఇక్కడ మత్తయి దృష్టిలో వుంది ఈ మతహింసలే. ఆ పిమ్మట శతాబ్దాల పొడుగున క్రైస్తవ సమాజం నానా హింసలకు గురౌతూవచ్చింది.