పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అన్వయం

అందరూ రక్షణం కొరకు తపించిపోరు. ఈ లోకసుఖభోగాలతోనే సరిపెట్టుకొంటారు. పూర్వ వేదంలో యావే ప్రభువు రక్షణం –యిర్మీయా 23,6. నూత్న వేదంలో క్రీస్తు మనకు రక్షణం - రోమా 4,25. మనమూ ఈ రక్షణాన్ని పొందాలి. ఇతరులూ దాన్ని పొందేలా చేయాలి.

పునీతులు దేవుని రక్షణం కొరకు తపించపోయారు. దేవుడు వారి కోరికలు తీర్చి వారికి పూర్ణశాంతిని, సంతృప్తిని దయచేసాడు. ఈ భక్తులు నేడు మనకు ఆదర్శంగా వుంటారు. వీళ్ళ దేవుని చిత్తాన్నితెలిసికొన్నారు. ఈ చిత్త ప్రకారం జీవించి పునీతులయ్యారు. నేడు మనం మనలను గూర్చిన దేవుని చిత్తమేమిటో తెలిసికోం. తెలిసికొన్నా ఆ చిత్తాన్ని లెక్కజేయం. మన యిష్టప్రకారం మనం జీవించబోతాం. అందుకే పునీతులం కాలేకపోతున్నాం. నన్ను పంపినవాని చిత్తాన్ని నెరవేర్చడమే నాకాహారం అన్నాడు ప్రభువు - యోహా 4,34.

తొలి నాలు ధన్యవచనాలు దేవుని పట్ల మనకుండే భక్తిని సూచిస్తాయి. మలినాలు తోడి నరుల పట్ల మనకుండే సంబంధాన్ని తెలియజేస్తాయి. ఇక ఈ నాల్డింటిని క్రమంగా పరిశీలిద్దాం.

{{{1}}}

ఈ ధన్యవచనం దేవుడు దయామయుడు కనుక మనం గూడ దయను కలిగి వుండాలని చెప్పంది. పూర్వ వేదంలో యావే ప్రభువు తన దయాగుణాన్ని మోషేకు తెలియజేసాడు. అతడు కరుణామయుడైన దేవుడు. సులభంగా కోపపడేవాడు కాదు. నిత్యం పేము జూపేవాడు. నమ్మదగినవాడు. మన దోషాలనూ అపరాధాలనూ మన్నించేవాడు - నిర్గ 34, 6–7. నూత్నవేదంలో క్రీస్తుకూడ ప్రధానంగా దయను జూపేవాడు. అతడు నాకు కావలసింది కారుణ్యంగాని బలికాదు అనే హోషేయ వాక్యాన్ని ఉదాహరించాడు - మత్త 9,13. ఈ తండ్రీకుమారుల్లాగే మనం కూడ తోడివారిపట్ల దయగలిగి ఉండాలని భావం. నూత్న వేదంలో క్షమింపనొల్లని సేవకుని కథ ఉంది. ఇతడు పైవారి నుండి దయను పొందాడు. కాని తన క్రిందివారికి దయను చూపలేదు - మత్త 18,33. మన ప్రవర్తనం ఈలా వుండకూడదు.

తోడివారి పట్ల దయను జూపేవాళ్ళు దేవుని నుండి దయను పొందుతారు. మనం ఇతరుల అపరాధాలను మన్నిస్తే దేవుడు మన అపరాధాలను మన్నిస్తాడు అని పరలోక జపం చెప్తుంది. దేవుడు నా తప్పలను మన్నిస్తాడు గాని నేనితరుల తప్పలను మన్నించను అని చెప్పకూడదు కదా!