పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/298

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అన్వయం

ఈ ధన్యవచనాన్ని ఇప్పుడు మనుం ఏలా పాటిస్తాం? మన పాపాలకు శోకించి పశ్చాత్తాపపడాలి. దైవరాజ్యం సమీపించింది, కనుక పశ్చాత్తాపపడండి అని క్రీస్తే బోధించాడు - మత్త 4,17. వినయాన్వితమూ పశ్చాత్తాప పూరితమూ ఐన హృదయాన్ని నీవు అనాదరం చేయవు అన్నాడు కీర్తనకారుడు- 51-17. కనుక మనం మన పాపాలకు చిత్తశుద్ధితో శోకించాలి.

మన శోకాలు చాల రకాలుగా ఉండవచ్చు. వ్యాధిబాధలు, మానసిక వేదనలు మనకు దుఃఖాన్నితెచ్చిపెడతాయి. సమాజంలో జరిగే హింసలు దౌర్జన్యాలు, మానభంగాలు అన్యాయాలు అక్రమాలు మనకు బాధ కలిగిస్తాయి. తిరుసభ పెద్దల్లో లోపాలు, క్రైస్తవుల దుష్కార్యాలు మనకు బాధను కలిగిస్తాయి. వీటన్నిటికీ మనం దుఃఖించవలసిందే. దేవుని యెదుట దుఃఖపడితే హృదయం పునీతమౌతుంది.

మన పాపాలనూ లోకంలోని దుష్టత్వాన్నీ తలంచుకొని దుఃఖించినపుడు దేవుడు మనకు ఓదార్పు నిస్తాడు. అనందానుభూతిని దయచేస్తాడు. దీనవలన మన హృదయానికి శాంతి లభిస్తుంది. చీకట్లో వెల్లురును చూచినట్లవుతుంది. దేవుడు మనకు దాపులోనే ఉన్నాడనుకొని ధైర్యం తెచ్చుకొంటాం. మన దేవుడు మన కషాల్లో మనలను అనునయించేవాడు. క్రీస్తు శ్రమలను తలంచుకొని శోకించడం గూడ మంచి పద్ధతి. అతని శ్రమల ధ్యానం మన హృదయంలోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది.

బాధలు ఎదురైనప్పుడు మనం తరచుగా ఇతరుల దగ్గరికి వెళ్ళి మన ఆపసోపాలు చెప్పుకొంటాం. కాని మొదట దేవుని దగ్గరికి వెళ్ళి మన బాధలను అతనికి చెప్పుకోవాలి. వినయంతో ఆ బాధలను తొలగించమని అడుగుకోవాలి. మన శత్రువులను క్షమించమని వేడుకోవాలి. అప్పుడు మనకు మనశ్శాంతి లభిస్తుంది.

{{{1}}}

ఇది మొదటి ధన్యవచనమే. ఇక్కడ వినములు అంటే దీనులు, పేదలు, వినయవంతులు, శాంతస్వభావులు అని అర్థం. వీళ్ళు తమ కషాల్లో దేవునిపై ఆధారపడతారు. శత్రువులమీద పగతీర్చుకోవాలి అనుకోరు. ఆ కార్యాన్ని దేవునికే వదలివేస్తారు. ప్రభువు నేను సాధుశీలుజ్ఞనీ వినవ్రు హృదయజ్ఞనీ మీరు నానుండి నేర్చుకొనండి అన్నాడు- మత్త 11,29. అతడు యెరూషలేము ప్రవేశించినపుడు ఇదిగో నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. అతడు వినముడు. గాడిదపై ఎక్కి వస్తున్నాడు అనే జకర్యా ప్రవచనం నెరవేరింది - మత్త 21,5. పౌలు పేర్కొన్న ఆత్మఫలాల్లో వినవ్రుత (సాత్వికత) కూడ వుంది - గల 5,23. కనుక వినమత ముఖ్యమైనగుణం. ఈ గుణం కలవారిలో అహంకారం ఉండదు. ఇతరుల మీద పెత్తనంచేసి వారిని అణచివుంచాలనే