పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/287

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినడానికి గాని, ప్రభు గ్రంథాన్ని పఠించడానికి గాని, ప్రభువుని ఆరాధించుకోవడానికి గాని ఓ తావులో సమావేశమౌతూంటాం. ఈలాంటి సమావేశాల్లో క్రీస్తు కూడ ప్రత్యక్షమై వుంటాడు. తన పేర సమావేశమైన భక్తులను దీవిస్తూంటాడు. ప్రభు దీవెన వలననే మన సమావేశాలూ, కూటాలూ కొంతవరకైనా ఫలసిద్ధి నందుతూన్నాయి.

20. తల్లి తన ప్రేవున బుట్టిన బిడ్డను మరచిపోతే పోతుందేమో గాని, నేను మాత్రం మిమ్ము మరచిపోను - యొష 49, 15,

తల్లి తన చంటిబిడ్డను మరిచిపోదు. తన పేవున బుట్టిన బిడ్డమీద కరుణచూపకుండా వుండలేదు. బిడ్డమీద అనురాగం లేని ఉన్మత్తురాలైన తల్లి ఒకవేళ ఎక్కడైనా ఉంటుందేమో కాని, భగవంతుడు మాత్రం తన ప్రజలమీద అనురాగం చూపకుండా వుండలేడు. అతడు తల్లిలాంటివాడు. బైబులు అతనిలో తల్లి గుణాలు వుంటాయని చెప్పంది. అతనిని తల్లి పక్షితో పోలుస్తుంది. ఆ ప్రభువు మనకు తల్లీ తండ్రి అని చెప్తుంది. ఇంట్లో అమ్మంటే మనకెంతో ఇష్టం. అమ్మను మించిన ప్రేమశక్తి ఏముంది? భగవంతుడుకూడ మన అమ్మలాంటివాడే. తన తరపున తాను మనలను అమ్మలాగ ప్రేమతో ఆదరించేవాడే. కాని మన తరపున మనకు, అతనిపట్ల అమ్మపట్ల కలిగే అనుభవం కలుగదు. ఈ లోపం మనది కాని అతనిదికాదు. కనుక మనం రోజురోజుకీ ఆ భగవంతుణ్ణి అర్థం ప్రయత్నం చేయాలి.

21. ఇతరులకంటే మేమే యోగ్యులమని భావించకండి - ఫిలి 2, 3.

ఇతరులను గౌరవించడానికి సంసిద్ధంగా వుండండి= రోమా 12, 10.

తరచుగా మనం ఇతరులను చిన్నచూపు చూస్తూంటాం. వాళ్ళకంటె మనం ఎంతో యోగ్యులం అనుకొంటూంటాం. ఇతరులను గౌరవించడానికీ, భూషించడానికీ ఒప్పకోం. వాళ్ళ గౌరవం మన అవమానం అన్నట్లుగా భావిస్తాం. అందుకే తరచుగా మనకూ ఇతరులకూ తగాదాలూ మనస్పర్థలూ వస్తుంటాయి. సోదర ప్రేమ కలికానికై నా కన్పించకుండా పోతుంది. ఈ సందర్భంలో పౌలు రెండు నియమాలిచ్చాడు. ఈ రెండు నియమాలనూ పాటిస్తే మనం ఇరుగుపొరుగువాళ్ళతో ఒద్దికగాను, ప్రేమభావంతోను జీవించగలం. ఒకటి : ఇతరుల కంటె మనం యోగ్యులం అనుకోకూడదు. వాళ్ళే మనకంటె యోగ్యులేమో అనుకొంటూండాలి. రెండు; ఇతరులను చిన్న చూపు చూడకూడదు. ఇతరులను గౌరవిస్తుండాలి. ఈలా ఇతరులను యోగ్యులనుగా భావించి గారవిస్తుంటే మన తగాదాలన్నీ వాటంతటవే సమసిపోతాయి.