పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/286

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. క్రీస్తు నిన్నా ఇవ్వాల్లా ఎప్పడూ ఒకే రీతిగా వుంటాడు.

- హెబ్రే 13, 8.

క్రీస్తు ఎప్పుడూ ఒకేరీతిగా వుంటాడు. అతనిలో మార్పేమీ లేదు. ఏసు అంటే యేమిటి? రక్షకుడు. అతడు తాను జీవించినపుడూ రక్షకుడే, ఇప్పడూ రక్షకుడే. అతని తరపున అతడు రక్షణం ఈయడానికి ఎప్పడూ సంసిద్ధంగానే వుంటాడు. కాని మన తరపున మనం మాత్రం ఆ రక్షణం పొందడానికి సంసిద్ధంగా వుండం, అతడు మార్పుచెందడు అన్నాం. కనుక అతనికి మనతో వుండే సంబంధంలో మార్పులేదు.కాని మనం మార్పు చెందుతూంటాం. కనుక మనకు అతనితో వుండే సంబంధం మారిపోతుంటూంది. అతడు రక్షకుడే గాని అతని రక్షణాన్ని పొందే యోగ్యత మాత్రం మన కుండదు. మరి మనం ఏంచేద్దాం? కనీసం ఈ సత్యమైనా తెలిసికొని చిత్తశుద్ధితోపశ్చాత్తాపపడదాం.

18. ఉనికిలో వుండే ప్రాణ్ణి దేన్నీ నీవు అసహ్యించుకోవు- జ్ఞాన 11,24

సాలోమోను జ్ఞానగ్రంధాన్ని వ్రాసిన రచయిత “ప్రభూ! ఉనికిలో ఉండే ప్రాణ్ణి దేన్నీ నీవు అసహ్యించుకోవు. అసహ్యించుకొనేవాడివైనట్లయితే వాటిని కలిగించే వుండవు. నీవు ప్రాణంపట్ల ప్రీతిజూపేవాడివి. నాశంలేని నీ యాత్మ ప్రతిప్రాణిలోను నెలకొని వుంటుంది” అంటాడు. ఇవి చాల గొప్ప వాక్యాలు. నేను అల్పుట్టే గావచ్చు, అధముట్టేగావచ్చు. నేనంటే నాకే అసహ్యం కలిగితే కలగవచ్చు. కాని ప్రభువు మాత్రం నన్ను ఆదరంతోను, గౌరవంతోను చూసూంటాడు. నన్ను లాగే ఇతరులను కూడ అభిమానంతో చూస్తూంటాడు. అందుచేత నామీద నాకే నమ్మిక వుండాలి. నాకు ఇతరుల మీద గౌరవముండాలి. ఇవి ఉత్సాహాన్ని కలిగించే భావాలు కదా!

19. ఇద్దరు ముగ్గురు నా పేర సమావేశమైన తావులో నేనూ నెలకొని వుంటాను = మత్త 18,20,

పూర్వవేదకాలంలో యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్తాన్ని వివరించేవాళ్లు,యూదభక్తులు ఆ దేవాలయంలో సమావేశమై ధర్మశాస్త్ర బోధలను ఆలించేవాళ్లు, అలాసమావేశమైన భక్తసమాజంలో ప్రభువు ప్రత్యక్షమై వుండేవాడు. ఆ ప్రభు సాన్యిధ్యాన్నిపూర్వవేద ప్రజలు "షెకీనా" అని పిల్చేవాళ్లు, షెకీనా అంటే నివాసం అని అర్థం. అనగాప్రభువు ఆ ప్రజల మధ్య నివసించేవాడని భావం. ఇక, పూర్వవేద ప్రభువులాగే నూత్నవేదప్రభువు కూడ తన ప్రజలతో వసిస్తుంటాడు. నూత్న వేదంలో మనం కూడ ప్రభు బోధలు