పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/284

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవునిమీద నిలువం, కాని ఆ ప్రభువుమీద ఆధారపడకపోతే మరెవరిమీద ఆధారపడ్డాం? అతనిమీద నిలువకపోతే అసలు నిలుస్తామా?

12. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపెట్టుకోలేదు. రోమా 15,8.

ఇది యెంత చిన్న వాక్యమో అంత గొప్ప వాక్యం. క్రీస్తు తన సుఖం తాను వెదుకోలేదు. స్వార్థంకొరకు జీవించలేదు. అలా జీవిస్తే అతడు సిలువ నెక్కేవాడే కాదు. తండ్రి మొదటనే అతనికి మరణ ప్రణాళికను ఒప్పజెప్పాడు. క్రీస్తు జీవించిన కాలమంతా స్వీయ మరణాన్ని మనసులో పెట్టుకొనే జీవిస్తూ వచ్చాడు. ఇక అతడు తన్నుతాను సంతోష పెట్టుకొనేదెలా? అతడు పరార్థజీవి. ఆ గురువువెంట నడచి పోగోరే శిష్యుడుకూడ తన్నుతాను త్యజించుకోవాలి - మత్త 16,24, ఆత్మత్యాగం లేందే ప్రభువును వెంబడింపలేం. ఐనా ఈ యాత్మత్యాగం స్వార్ధమానవునికి సుతరామూ గిట్టదు. మనందరిలోను ఈ స్వార్థమనేది చాల బలీయంగా వుంటుంది. భక్తుడు ఫ్రాన్సిస్ డి సేల్పు చెప్పినట్లు, మనం చచ్చాక పదిహేను నిమిషాలకుగాని మనలోని స్వార్ధం చావదు! కనుక మనకు గూడ పరార్థజీవితం పట్ల కోరిక పట్టించమని స్వార్ణాన్ని జయించిన ఆ ప్రభువునే మనవి చేద్దాం.

13. వాళ్ల పక్షిరాజులాగ రెక్కలు విప్పి పైపైకెగురుతారు.

— యొష 40, 31.

ప్రభువును నమ్ముకొని జీవించేవాళ్ళను గురించి చెపూయెషయా ఈలా వ్రాసాడు. "ప్రభువును నమ్మకున్న వాళ్ళు నూత్న బలాన్ని పొందుతారు. పక్షిరాజులాగ రెక్కలు విప్పి పైపైకెగిరిపోతారు. వాళ్ళు పరుగెత్తుతూ గూడ అలుపు జెందరు. ప్రయాణం చేస్తూకూడ సొమ్ముసిల్లిపోరు." పక్షిరాజు ఆకాశంలో చాల ఉన్నతంగా ఎగురుతూంటుంది. దాని బలమూ లాఘవమూ చూస్తే భూమిమీద నడిచే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభువును నమ్ముకొన్నవాళ్ళు, అతని మీద ఆధారపడి జీవించేవాళ్ళు, ఈ పక్షిరాజులాగ మీదిమీది కెగిరిపోతారు. రోజురోజుకీ వృద్ధిచెందుతారు. వాళ్ళకు అలుపూ, ఆయాసమూ అంటూ వుండదు. చాలమంది భక్తులూ, పునీతులూ మహత్తరమైన జీవితం గడిపారు. ఎంతో కృషి చేసారు. ఎన్నో కార్యాలు సాధించారు. వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూంటే ఒక్క మనిషి యింత పని ఎలా చేసాడబ్బా అని ఆశ్చర్యపోతాం. వాళ్ళను పక్షిరాజులాగా అంతవన్నతంగా ఎగిరించింది ప్రభువే. భగవంతునిమీద ఆధారపడి అతని దయకు పాత్రులమౌతూ జీవించేపుడు మన జీవితంలో కూడ ఓ నూత్న శక్తి, నూత్నోత్సాహమూ కనిపిస్తుంది. ఈ విషయంలో మీ యనుభవాన్ని మీరే పరీక్షించి చూచుకొనండి.

276