పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిష్యులను జూచి మీరూ వెళ్ళిపోతారా అని అడిగాడు. అపుడు పేత్రు పై మాటలు పల్మాడు. ఇవి చాల భక్తిభరితమైన వాక్కులు. క్రీస్తును వదలిపెట్టి ప్రపంచ వ్యామోహాల్లో చిక్కుకుంటే, సంతృప్తి కలుగుతుందా? ఈ లోకపు సిరిసంపదలూ, సుఖభోగాలూ పేరుప్రతిష్ఠలూ నిత్యజీవం ఈయగలవా? ఈ లోకంలో ఏమి పాముకుంటాం? నిత్యజీవపు మూటలు విన్పించేవాడూ, నిత్యజీవం ప్రసాదించేవాడూ ప్రభువొక్కడే కనుక అతని కంటిపెట్టుకుని వుండేవాడు బ్రతుకుతాడు, అతన్ని విడనాడేవాడు నాశమైపోతాడు.

7. ఎవరి మనసు నీ మీద లగ్నమౌతుందో వాళ్ళకు నీవు పరిపూర్ణ శాంతిని

అనుగ్రహిస్తావు. — యెష – 26, 3.

నరులు చిత్తశాంతికోసం ఎంతకృపైనా చేస్తారు. కాని తరచుగా దాన్ని పొందలేరు. హృదయాన్నిదేవునిమీద లగ్నంచేసికొన్న భక్తునికి భగవంతుడు పరిపూర్ణమైన మనశ్శాంతి ననుగ్రహిస్తాడు. ఆ ప్రభువుని నమ్మినవాళ్లకు కష్టాలు రాకుండా వుండవుగాని, ఆ కష్టాల్లో గూడవాళ్ళ భగవంతుని విడనాడరు. అతడూ వాళ్లను చేయి విడువడు. మహాపర్వతంమీది శిఖరాల క్రింది భాగంలో మబ్బులు ఆవరించి వుంటాయి. కాని ఆ శిఖరాల మీది భాగాలు మాత్రం మబ్బులకు మీదుగా తలలెత్తుకొని సూర్యునివైపు చూస్తుంటాయి. సూర్యరశ్మితో ప్రకాశిస్తూంటాయి. అలాగే కష్టాల్లో చిక్కుకొన్న భక్తులుకూడ భగవంతునినుండి దృష్టి మరల్చరు. ఆ ప్రభువు కూడ వాళ్ళను హృదయశాంతితో సంతృప్తి పరచకమానడు.

8. క్రీస్తును పొందాలనుకొని సమస్తమూ పెంటప్రోవుతో సమానంగా ఎంచాను. - ఫిలి 3,8.

పౌలు యూదుల జాతిలో పుట్టినవాడు. యూదుల చదువులు చదివాడు. గమలియేలు నొద్ద ధర్మశాస్త్రం నేర్చుకొన్నాడు. యూదమతాన్ని తు.చ. తప్పకుండ పాటిస్తు వచ్చాడు. ఇవన్నీ తనకెంతో గౌరవకారణాలు అనుకొన్నాడు. కాని అతడు క్రీస్తు శిష్యుడయ్యాక ఈ విలువలన్నీ వ్యర్ధమని తెలిసికొన్నాడు. అతన్ని రక్షించింది క్రీస్తుగాని మోషే ధర్మశాస్త్రం గాదు. ఆ క్రీస్తు మరడోత్థానాల్లో పాలుపొందితే చాలు తాను ధన్యుడౌతాడు. కనుక ఆ క్రీస్తుతో పోల్చుకుంటే సమస్త విలువలూ పెంటప్రోగులాగ నిప్రయోజనమైనవి అనిపించాయి అతనికి, మనం తరచుగా ఉద్యోగాన్నో ధనాన్నో హోదానో, సుఖాన్నో గొప్ప విలువగా భావిస్తుంటాం. కాని ఈ విలువలన్నిటినీ మించిన విలువ క్రీస్తు. అతనితో పోల్చిచూస్తే ఈ విలువలన్నీ విలువలేనివి. కనుక క్రీస్తు అనే విలువను సంపాదించిన వాడొకడు విలువ కలవాడు. 274