పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/281

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐనా ఆ మంచి పనిని మనంతట మనమే చేసామో అన్నట్లు కడపట అతడు మనలను బహూకరిస్తాడు. ఆ ప్రభువు అంత మంచివాడు. అతనికోసం మనం ఓ మంచి దాసుని లాగ ఉత్సాహంతో పని చేయాలి. భక్తుడు అగస్టీనులాగే మనమూ ఈలా ప్రార్థిద్దాం. "ప్రభూ! మా పనులన్నీ నీ ప్రేరణతో ప్రారంభమై, నీ సహాయంతో కొనసాగి, నీ దయవల్లనే ముగింపు జెందునుగాక."

4. మీరు ప్రార్థనలో అడిగిందల్లా పొందామని విశ్వసించారంటే తప్పక

పొందుతారు - మార్కు 11, 24.

మానసిక రంగంలో నిండు నమ్మికతో ఓ పని ప్రారంభిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. ఆధ్యాత్మిక రంగంలో కూడ నమ్మికతో ఓ పని మొదలుపెట్టామో విజయం పొందుతాం. తరచుగా మనకు ఈ నమ్మిక ఉండదు. అందుకే మనకు విజయం లభించదు. భక్తిమంతులు దేవుని యందు నమ్మిక పెట్టుకొని కృషి చేస్తుంటారు. విజయం పొందుతుంటారు కూడ. ఈ మనస్తత్వం మనం కూడా అవశ్యం సాధించాలి. ఓమారు ఓ తండ్రి దయ్యంపట్టిన తన కుమారుని క్రీస్తు నొద్దకు తీసికొనివచ్చి దయ్యాన్ని పోద్రోలమని కోరాడు. నేను దయ్యాన్ని పోద్రోలగలననే నమ్మిక నీకుందా అని క్రీస్తు అతన్నడిగాడు. అతడు “ప్రభూ! నేను నమ్ముతూనే వున్నాను. ఐనా నా నమ్మిక కొరతవడినటైతే నీవా కొరతను తీర్చు" అన్నాడు- మార్కు9, 24 ఈ తండ్రికి ఉన్నపాటి నమ్మిక మనకుందా?

5. అతని యందే జీవిస్తున్నాం, చైతన్యం పొందుతున్నాం, ఉనికిలో

ఉంటున్నాం. అచ 17,28.

పౌలు ఆతెన్సు మహాసభలో పల్మిన వాక్యమిది. మనం నిత్యం ఆ భగవంతుని యందు నెలకొని వుంటాం, చేప నీటిలో మునిగితేలుతూంటుంది. తామరాకు నీటిమీద తేలియాడుతూంటుంది. పక్షి గాలిలో యెగురుతూంటుంది. అలాగే మనమూ ఆ భగవంతునిలో మునిగితేలుతూంటాం. త్రాటినుండి వ్రేలాడుతున్న రాయిలాగ నిత్యం, ప్రభువమీద వ్రేలాడుతూంటాం. అతడు పట్టు వదలితే త్రాడు తెగిన రాయిలాగ గబాలున పడిపోతాం. ఏ శూన్యాన్నుండి వచ్చామో మళ్ళా ఆ శూన్యానికే వెళ్ళిపోతాం. మన ఉనికీ మనికీ అంతా ఆ ప్రభువునందే. కనుక అతన్నిస్మరించుకొంటూ జీవించే నరుడు ధన్యుడు.

6. ప్రభూ! నిత్యజీవమిచ్చే పలుకులు నీ నుండి వెలువడుతూన్నాయి. మేమిక

యెవరి దగ్గరకు వెత్తాం! - యోహా 6, 68.

క్రీస్తు "నా శరీరాన్నే మీకు ఆహారంగా ఇస్తా" నని బోధించాడు. ఆ బోధ రుచించని శిష్యులు అతన్ని వదలివేసి వెళ్ళిపోయారు. క్రీస్తు నిరుత్సాహపడి మిగిలిన 273