పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/278

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దారి తీస్తాయి - రోమా 8,5–9. ఇంకా శరీరం కోరికలు ఆత్మ కోరికలకూ, ఆత్మ కోరికలు శరీరం కోరికలకూ విరుద్ధంగా వుంటాయి. శరీరం కోరికలు జారత్వం, విగ్రహారాధనం, శత్రుత్వం, కలహం, అసూయ, క్రోధం, స్వార్ధం, కక్షలు, త్రాగుబోతుతనం మొదలైనవి. కాని ఆత్మ కోరికలు ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, నిగ్రహం మొదలైనవి- గల 5, 16-24. కనుక శారీరక మానవులది ఒక త్రోవా, ఆధ్యాత్మిక మానవులది మరొక త్రోవా.

12. పై నుండి వచ్చినవాళ్ళ - క్రింది నుండి వచ్చినవాళ్ళు

పైనుండి వచ్చినవాళు పరలోకానికి చెందినవాళ్చు. క్రీస్తు ఈ వర్గానికి చెందినవాడు. క్రింది నుండి వచ్చినవాళ్లు ఇహలోకానికి చెందినవాళ్లు, క్రీస్తుని నిరాకరించిన యూదులు ఈ మరాకి చెందినవాళ్ళు - యోహా 8, 23.

13. ప్రపంచజ్ఞానం - దైవజ్ఞానం

కొందరిది ఈ ప్రపంచజ్ఞానం. ఇది నాశమై పోతుంది. కొందరిది భగవంతుని జ్ఞానం. ఇది శాశ్వతంగా నిలుస్తుంది. 1 కొ 2, 15. ఆ ప్రభువు మేము విజ్ఞానులం అనుకొనేవాళ్ళ జ్ఞానాన్ని నాశం చేస్తాడు - 1 కొ 1, 19.

14. లౌకికజ్ఞానం - దివ్యజ్ఞానం

కొంతమందికి లౌకికజ్ఞానం సమృద్ధిగా వుంటుంది. ఈలాంటివాళ్ల హృదయాల్లో ఈర్య ద్వేషం, స్వార్ధం, అసూయ, అశాంతి మొదలైన దురుణాలుంటాయి. మరి కొంతమందికి దివ్యజ్ఞానం බිමටද්යාටයි. ఈలాంటివాళ్ళ హృదయంలో నిర్మలత్వం, శాంతం, మృదుత్వం, స్నేహం, కరుణ, నిజాయితీ మొదలైన సదుణాలుంటాయి - యాకో 3, 13-18.

15. సైతాను బిడ్డలు - దేవుని బిడ్డలు

పాపకార్యాలకు పాల్పడేవాళ్ళు సైతాను బిడ్డలు, తోడినరుణ్ణి ప్రేమింపనివాళ్ళు ఈలాంటివాళ్ళు, దుష్మార్యాలకు పాల్పడనివాళ్ళు దేవుని బిడ్డలు. సోదర ప్రేమ కలవాళ్లు ఈలాంటివాళ్ళ - 1 యోహా 3,8-10.

16. సోదర ప్రేమ కలవాళ్ళ - అది లేనివాళ్ళ

క్రైస్తవ భక్తుడికి సోదర ప్రేమను మించిన పుణ్యం లేదు-1కొ13,1-3.కాని అది కలవాళ్ళు కొందరు, లేనివాళ్ళు కొందరు.

17. ఆజ్ఞను పాటించేవాళ్ళు- పాటించనివాళ్ళ

శిష్యులు సోదర ప్రేమతో జీవించాలని క్రీస్తు ఆజ్ఞ. ఈ యాజ్ఞను పాటిస్తే అతని శిష్యుల మౌతాం. లేకపోతే కాము- యోహా 13,45. 27O