పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/277

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



6. జీవమూ - మృత్యువూ

ధర్మమార్గం జీవానికీ, అధర్మమార్గం మృత్యువుకీ చేరుస్తుంది - సామె 12, 28. బుద్ధిమంతుడు జీవానికి చేర్చే పరమపధాన పయనిస్తాడే గాని మృత్యువునకు చేర్చే అధోమార్గాన నడవడు-15,24. కొందరు తప్ప త్రోవల్లో నడచి మృత్యువునీ, మరికొందరు మంచి బాటల్లో నడచి జీవాన్నీ చేపడతారని భావం.

7. గోదుమలూ - కలుపు గింజలూ

ఒక యజమానుడు తన పొలంలో గోదుమలు విత్తాడు. అటుతరువాత అతని శత్రువు వచ్చి ఆ పొలంలో కలుపు గింజలు చల్లాడు. గోదుమా కలుపూ రెండూ కలసే పెరిగాయి — మత్త 13,24-30, దైవరాజ్యంలో కొందరు గోదుమ పైరులాంటివాళ్ళు మరి కొందరు కలుపు మొక్కల్లాంటివాళ్ళు — మత్త 13, 24—20.

8. దేవుని సంకల్పం - శారీరక వ్యామోహం

క్రీస్తుని అనుసరించేవాళ్ళు దైవ సంకల్పం ప్రకారం జీవించాలే గాని శారీరక వ్యామోహాల ప్రకారం జీవించగూడదు-1 పేతురు 4,1–2. అవి రెండూ భిన్నమార్గాలు.

9. సులభమైన మార్గం - కష్టమైన మార్గం

జీవానికి పోయే మార్గం ఇరుకైంది, కష్టమైంది. కనుక కొద్దిమంది మాత్రమే ఆ త్రోవన బోతారు. వినాశానికి చేర్చే మార్గం విశాలమైంది, సులభమైంది. కనుక చాలమంది ఆ బాటన వెత్తారు - మత్త 7, 13-14 శిష్యుడు తన గురువు లాగే కష్టమైన మార్గాన్ని ఎన్నుకోవాలి.

10. మంచి పండ్లు - చెడ్డ పండ్లు

మామిడి చెట్టు మంచిపండ్లను కాస్తుంది. కనుక అది మంచి చెట్టు. ఉమ్మెత్త చెట్టు చెడ్డకాయలు కాస్తుంది. కనుక అది చెడ్డచెట్టు. పండ్లను బట్టి చెట్టుని నిర్ణయిస్తాం. కొందరి క్రియలు మామిడి పండ్లలా వుంటాయి. వాళ్ళ మంచిచెట్టు లాంటివాళ్ళ కొందరి క్రియలు ఉమ్మెత్త కాయల్లా వుంటాయి. వాళ్ళు చెడ్డచెట్టు లాంటివాళ్ళు ఈలా పండ్లను బట్టి చెట్టని నిర్ణయిస్తాం - మత్త 7,20. మంచి పండ్లు కాయని చెట్టని నరికి అగ్నిలో బడవేస్తారు. దానికి శిక్ష తప్పదు -3, 10. ఈయాలోకనాలను బట్టి మంచిపనులు చేసేవాళ్ళ కొందరు, చెడ్డపనులు చేసేవాళ్ళు కొందరు అని అర్థం చేసికోవాలి.

11. శారీరక మానవులూ - ఆధ్యాత్మిక మానవులూ

కొందరు శరీరం కోరికల ప్రకారం జీవిస్తారు. కాని శారీరక వాంఛలు మరణానికి దారి తీస్తాయి. కొందరు ఆత్మను అనుసరించి జీవిస్తారు. ఆత్మ కోరికలు జీవానికీ శాంతికీ 269