పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/276

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ భక్తుడు వివేకాన్ని అలవర్చుకోవాలి. దుష్ట మార్గమేదో శిష్టమార్గమేదో చక్కగా గుర్తించాలి. చెడ్డ త్రోవను విడనాడి మంచి త్రోవలో నడవడం నేర్చుకోవాలి. ఇందుకు కూడ ఈ వ్యాసం తోడ్పడుతుంది. κ. 1. సజ్జనులూ - దుర్జనులూ ఉదయభానుడు అంతకంతకూ తేజరిల్నతూ నిండు వెలుగుని సంతరించుకొంటాడు. సజ్జనులు నడిచేమార్గం ఈలా ఉంటుంది. కాని దుర్జనుల మార్గం తమోమయంగా వుంటుంది. వాళ్ళు ఏదో తట్టుకొని పడిపోతారు. ఏమి తట్టుకొని పడ్డారో గూడ వాళ్ళకే తెలియదు - సామె 4,18-19. ఈ వాక్యాలను బట్టి తేజోమార్గంలో నడచేవాళ్ళ సత్పురుషులనీ, తమోమార్గంలో నడచేవాళ్ళదుర్మార్డులనీ అర్థం చేసికోవాలి. నరుల్లో కొందరు సజ్జనులూ, కొందరు దుర్జనులూ, 2. భక్తిమంతులూ - భక్తిహీనులూ కొందరికి ప్రభువు ధర్మశాస్త్రం పట్ల అపారమైన భక్తి వుంటుంది. వాళ్ళు నిత్యం దాన్ని పరిస్తారు. ధ్యానిస్తారు. దాని యాజ్ఞలను సంతోషంతో పాటిస్తారు. ఫలితంగా దేవుని దీవెనలు పొందుతారు. విజయాలు సాధిస్తారు. వీళ్ళ ఏటివొడ్డున ఎదిగిన చెట్టులా సత్ఫలాలనిస్తారు. కాని కొందరు దుషుల మార్గంలో నడుస్తారు. దేవుణ్ణి లెక్కచేయరు. వీళ్ళ వినాశనాన్ని కొనితెచ్చుకొంటారు. గాలికి కళ్ళంలోని పొట్టు, తాలు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతారు -1వ కీర్తన. 8. సత్యవాదులు - అసత్యవాదులు ప్రవక్తలు సత్యప్రియలు, అసత్యప్రియలు అని రెండు రకాలు-2 పేతురు2,1- 4. నరులు సత్యమార్గంలో నడవాలే గానీ అసత్యమార్గంలో నడవకూడదు. 4. గర్వాత్ములు - వినయాత్మలు కొందరు గర్విషులు, కొందరు వినయవంతులు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. కాని వినుములకు తన కృపను దయచేస్తాడు- యూకో 4,6. 5. చీకటిలో నడిచేవాళ్ళూ - వెలుగులో నడచేవాళ్ళూ దుప్రియలు చేసేవాడు వెలుగు దగ్గరికి రాడు. అలా వస్తే వాడి దుష్టకార్యాలు బయటపడతాయి. కనుక అతడు చీకటిని ప్రేమించి చీకటిలోనే వుండిపోతాడు. కాని సద్వర్తనుడు ధైర్యంగా వెలుగు దగ్గరికి వస్తాడు. తన కార్యాలు దేవుని చిత్తానుసారమే జరిగాయని నీరూపించుకొంటాడు - యోహా 3,19-21. జగతికి జ్యోతి క్రీస్తే ఆ ప్రభువుని అనుసరించేవాడు చీకటిలో నడవడు. అతడు జీవపు వెలుగునే పొందుతాడు-8, 12. జ్ఞానస్నానానికి ముందు మనం చీకటిలో వుంటాం. కాని జ్ఞానస్నానంలో వెలుగును పొందుతాం. అప్పటినుండి వెలుగులోనే నడవాలి - ఎఫె 5,8. ఉత్తాన క్రీస్తు వెలుగు నిత్యమూ మనమిూద ప్రకాశిస్తుంటుంది - 5, 14. ఈ వాక్యాలను బట్టి క్రీస్తు శిష్యుడు వెలుగులో నడచేవాడనీ పాపి చీకటిలో నడచేవాడనీ అర్థం చేసికోవాలి. 268