పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/275

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిలువ విూద ప్రభువు హృదయంలో నుండి వెలువడిన నీళ్ళ ఈ జీవజలాలే - యోహా 19,34. ఈ నీటిని మనం మక్కువతో ఆశించాలి.

2. ఆత్మద్వారా తండ్రిని ఆరాధించాలి అన్నాడు ప్రభువు. ఈ యారాధనను సాధ్యం చేయడానికి ఆత్మ మనలను దేవుని బిడ్డలను చేస్తుంది - రోమా 8,15-16, మనం దేవుని బిడ్డలమై దేవుణ్ణి "నాన్నా" అని పిలుస్తాం. అతన్ని భక్తితో కొలుస్తాం.

ఆత్మ మనం తండ్రిని ఆరాధించేలా చేయటం మాత్రమే కాదు, క్రీస్తు దగ్గరికి చేరేలా కూడ చేస్తుంది. ఆ ప్రభువు సత్యం అని చెప్పాం - యోహా 14,6. ఆత్మ మనల్ని సర్వసత్యం లోకి నడిపిస్తుంది-16, 13. అనగా మనల్ని సంపూర్ణ క్రీస్తు లోనికి నడుపుతుంది. మనం క్రీస్తుని అర్థం చేసుకొనేలా చేస్తుంది. క్రీస్తుని చేరుకొనేలా, ఆ ప్రభువునిర పొందేలా చేస్తుంది. కనుక ఆ ప్రభువుని అధికాధికంగా పొందే భాగ్యం దయచేయమని మనం ఆయాత్మడ్డి అడుగుకోవాలి. 3. దేవుని వరాన్నిస్వీకరించాలి అంటే హృదయ పరివర్తనం అవసరం. ప్రభువు వాక్కు ఈ హృదయ పరివర్తనాన్ని పుట్టిస్తుంది. అది ఓ న్యాయాధిపతియై మనకు తీర్పు చెపుతుంది. మన దోషాన్ని తెలియజేస్తుంది - హెబ్రే 4, 12. వాక్కు పరివర్తనం కలిగిస్తుంది అనడానికి దావీదుక కథ చక్కని తార్మాణం. అతడు ఊరియాను చంపించి అతని భార్యయైన బతేబాను అపహరించాడు. అప్పడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుని పేదవాని గొర్రెపిల్లని అపహరించిన ధనికునితో పోల్చి కథ చెప్పాడు. ఆ కథలో దొంగపనికి పాల్పడిన యజమానుడు ఎవరో కాదు నీవేనని హెచ్చరించాడు. దానితో దావీదునకు పరివర్తనం కలిగింది - 2సమో 12,7. ఆ దావీదునకు లాగే, ఆ సమరయ స్త్రీకి లాగే ప్రభువు వాక్కుమనకు కూడ పశ్చాత్తాప భాగ్యాన్ని సంపాదించి పెడుతుంది. కనుక మనం ప్రభువు వాక్కుని ధ్యానం చేసికొని పరితాపం చెందుతుండాలి. తన వాక్కు ద్వారా మన తప్పలను ఎత్తి చూపించమని ప్రభువుని అడుగుకోవాలి. 4. క్రీస్తు సమరయ స్త్రీ రక్షణం కొరకు దాహం గొన్నాడని చెప్పాం. అలాగే అతడు మన రక్షణం కొరకు కూడ దాహం చెందుతాడు. మనం పాపమార్గంలో బోయినపుడు అతడు తప్పిపోయిన గొర్రెను లాగ మనలను వెతుక్కొంటూ వస్తాడు-లూకా 15,4 మనం అతన్ని విస్మరించినా అతడు మనలను విస్మరించడు. అలాంటి ప్రభువుకి మనం చేయెత్తి దండం పెట్టాలి. కాలుజారి పాపకూపంలో పడిపోయినపుడల్లా అతడు మనకు ప్రబోధం కలిగించి మనలను బయటికి లాగాలని భక్తితో అడుగుకోవాలి.

29. రెండు మార్గాలు

బైబులు రెండుమార్గాలను పేర్కొంటుంది. ఒకటి సన్మారులు నడచేది, మరొకటి దుర్మార్డులు నడచేది. ఈ రెండు మార్గాలను గూర్చి చెప్పే బైబులు అవలోకనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనమే మార్గంలో నడుస్తున్నామో స్పష్టమౌతుంది. కనుక ఈ వ్యాసం ఆత్మపరిశీలనానికి ఉపయోగపడుతుంది. 267