పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/274

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెరవేర్చేవాడు. తండ్రిని గూర్చి ప్రజలకు తెలియజేసేవాడు. కనుక అతనికి “సత్యం" అని పేరు - యోహా 14,6. కనుక ఆత్మద్వారాను క్రీస్తుద్వారాను మాత్రమే తండ్రిని ఆరాధించాలనీ, అదొక్కటే నిజమైన ఆరాధనమనీ, తెలియజేసాడు క్రీస్తు.

నిజమైన ఆరాధనం ఈలా వుంటుందని సమరయ మహిళకు తెలియదు. కనుక ఆమె యేసు పలుకులకు విస్తుపోయింది. మేమంతా ఎదురుచూసే మెస్సీయా ఎటూ రాబోతున్నాడు గదా, అతడు వచ్చాక ఈ విషయాలన్నీ మాకు సవివరంగా తెలియజేస్తాడులే అంది. ఆ మాటలతో క్రీస్తు తన్ను ఎరుకపరచుకొనే సమయం వచ్చింది. అతడు “అమ్మా! నీవు ఆ మెస్సీయా ఎప్పడో వస్తాడు అనుకుంటున్నావు. నీతో మాట్లాడే నేను ఆ మెస్సీయాను" అన్నాడు. ఆవిడ ప్రభువుని మెస్సీయాగా గుర్తించింది.

ప్రభువు అభిలషించినట్లే ఆమె తనకు జీవజలం దయచేయమని అడిగింది - 15వ వచనం, అతన్ని మెస్సీయాను గాను గుర్తించింది- 26వ వచనం. ఈ రెండు భాగ్యాలూ మనకూ అబ్బితే మన జీవితం గూడ ధన్యమౌతుంది.

ప్రార్ధనా భావాలు

1. ప్రభువు సమరయ స్త్రీకి జీవజలమిస్తానని చెప్పాడు. ఈ జీవజలం పవిత్రాత్మే ప్రభువుని విశ్వసించే భక్తుని హృదయంలో నుండి జీవజలాలు పారతాయి. ఈ జీవజలం ఆత్మే. ఈ జీవజలం వల్ల భక్తుని దప్పిక తీరుతుంది - యోహా 7,37-39. అన్ని వరప్రసాదాలకూ మూలం పవిత్రాత్మే ఆ యాత్మను పొందడం ద్వారా భగవంతుణ్ణి దర్శించాలి, అమరత్వం పొందాలి అనే మన కోరికలు నెరవేరుతాయి. ఆత్మ క్రీస్తు హృదయంలో నుండి భక్తుని హృదయంలోకి వేంచేస్తుంది. కనుక ఆ సమరయ స్త్రీ లాగే మనం కూడ ప్రభువుని జీవజలం దయచేయమని అడుగుకోవాలి.

రెండవ శతాబ్దంలో వేదసాక్షిగా మరణించిన మహాభక్తుడు ఆంటియోకయ ఇన్యాసివారు. ఈయన్ని రోములో సింహాలకు మేతగా వేసారు. ఇతడు రోమా పౌరులకు వ్రాసిన జాబులో ఈ జీవజలాన్ని పేర్కొన్నాడు. "ఆ జీవజలం నా అంతరంగంలో నుండి నన్ను తండ్రి చెంతకు రమ్మని పిలుస్తూంది" అని చెప్పకొన్నాడు. అనగా పవిత్రాత్మే నీవు వేదసాక్షిగా మరణించి తండ్రిని చేరుకొమ్మని ఇగ్నేప్యస్ భక్తుణ్ణి ప్రభోదించిందని భావం. క్రీస్తు దయచేసే జీవజలం, అనగా అతని ఆత్మ - మనలను తండ్రిచెంతకూ, క్రీస్తు చెంతకూ చేరుస్తూంటుంది.

16వ శతాబ్దపు పునీతురాలు అవిలా తెరేసమ్మగారికి కూడ ఈ జీవజలాల పట్ల అపారమైన భక్తి వుండేది. ఆమె సమరయ స్త్రీ క్రీస్తుని జీవజలాలీయమని అడిగిన సంఘటనాన్ని చిత్రంగా వ్రాయించుకొని ఆ చిత్రాన్ని ఎప్పడూ తనముందుట వుంచుకొనేది. ఆ సమరయ మహిళకు లాగే తనకు గూడ జీవజలాలు ప్రసాదించమని ప్రభువుని వేడుకొంటూండేది. ఈ భక్తురాలు మనకు కూడ ఆదర్శంగా ఉంటుంది. 266