పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/270

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పాడు. ప్రజలు పెట్టే హింసనూ వాళ్లు చేసే ఎగతాళినీ సహించైనా సరే వాక్యబోధ చేస్తానని ప్రభువుకి మాటయిచ్చాడు. ఇదంతా ప్రార్ధనా రూపంలో జరిగింది.

ఇక్కడ మనం ప్రవక్త బాధను అర్థం చేసికోవాలి. అతని నిజాయితీని చిత్తశుద్ధినీ మెచ్చుకోవాలి. అతడు దేవుని యెదుట మనసు విప్పి మాట్లాడ్డాన్ని హర్షించాలి. ఆ భక్తుడు దేవునితో నీవు మోసం చేసే నదిలాంటివాడివి అన్నాడు. నమ్మించి కన్నెను చెరిచే మోసగాడి లాంటివాడివి అన్నాడు. తన బాధంతా ఒలకబోసికొన్నాడు. అతడు దేవుణ్ణి గాఢంగా అనుభవానికి తెచ్చుకొన్నవాడు కనుకనే ఆ ప్రభువుతో అరమరికలు లేకుండా మాట్లాడగలిగాడు. దైవభక్తి కలవాళ్ళు ධීකූබ්ෂී* ధైర్యంగా మాట్లాడతారు. అతనితో వాదిస్తారు. అతన్ని సవాలు చేస్తారు, నిందిస్తారు. కాని ఈ భక్తులు కడవ దేవుణ్ణి విడనాడరు. దేవునికి అంటిపెట్టుకొని వుంటారు. దేవుణ్ణి తమ చిత్తానికి లొంగదీసికోరు. తామే దేవుని చిత్తానికి లొంగుతారు.

3. ఈ యిర్మీయాలాగ మనం కూడ చిత్తశుద్ధితో, హృదయపూర్వకంగా దేవునికి సేవలు చేయాలి. ఆ సేవలో అతడు పంపే కష్టాలను గూడ భరించాలి. అతని నుండి పారిపోవాలనుకోవడానికి బదులుగా అతనికింకా సన్నిహితులం గావాలి. అతని ఆజ్ఞను త్రోసి పచ్చడానికి బదులుగా అతనికింకా విధేయులం కావాలి.

మనలను హింసించేవారి కొరకు ప్రార్ధన కూడ చేయాలి. యిర్మీయా యిలా జపించాడు. అతడు దేవునితో "ప్రభూ! నేను నీ సమక్షంలో నిలచి నన్ను హింసించేవారి పక్షాన నీకు మనవి చేసాను. నీ కోపాన్ని శాంతింపజేసాను. నీవీ సంగతి జ్ఞప్తికి తెచ్చుకో" అని పల్మాడు - 18,20. మన ప్రవర్తనం కూడ ఈలాగే వండాలి.

28. సమరయ స్త్రీ

యోహా 4, 4–26.

యోహాను సువిశేషంలో క్రీస్తు సమరయ స్త్రీని కలసికొన్న కథ వస్తుంది. ఈ కథ చాల సత్యాలను బోధిస్తుంది. రచయిత ఈ వదంతాన్ని నాటకీయ శైలిలో రచించాడు. బైబులు పండితులు ఈ సంఘటనాన్ని చాల ఘట్టాల క్రింద విభజిసారు. మనం దీన్ని 6 ఘట్టాలుగా విభజించి పరిశీలించి చూద్దాం.

1. ప్రభువు ఆ స్త్రీని కలసికోవడం, 4–9 వచనాలు

క్రీస్తు సమరయ మండలం గుండా ప్రయాణం చేస్తూ సుఖారు అనే గ్రామం చెంతకు వచ్చాడు. అక్కడ పూర్వం యాకోబు త్రవ్వించిన బావి వుంటే దాని వొడ్డున చతికిలబడ్డాడు. అది మధ్యాహ్నసమయం కావడం చేత అతడు బాగా అలిసిపోయి వున్నాడు. అతనికి దాహం వేసింది. అంతలో సమరయ స్త్రీ ఆ బావిలో నీళ్ళు చేదుకోవడానికి రాగా క్రీస్తు ఆమెను త్రాగడానికి నీళ్ళీయమని అడిగాడు. దీనితో వాళ్లిద్దరికీ సంబాషణం