పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/269

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాశ్వతావమానం తెచ్చుకొందురు గాక! నేను నావ్యాజ్యాన్ని నీకు అప్పగించాను. నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతును గాక" అని పల్మాడు - 20, 11-12. ఈ యిర్మీయా భక్తివిశ్వాసాలు మనకు కూడా అలవడితే ఎంత బాగుంటుంది! ఆపదలు వచ్చినపుడు ప్రభువు మిూద సుమ్మర్లు పడవచ్చు. అతనిముందు మన కోపతాపాలు వెళ్ళగ్రక్కవచ్చు. కాని అతన్ని విడనాడ్డం మాత్రం భావ్యం కాదు.

27. హృదయంలోని అగ్ని - యిర్మీ 20.9

l. యిర్మీయా కాలంలో యూదులకు ఫరోరవిపత్తు దాపరించింది. బాబిలోనియా రాజునెబుకద్నెసరు యెరూషలేమనీ దేవాలయాన్నీ ధ్వసంచేసి యూదులను బాబిలోనియాకు బందీలనుగా కొనిపోయాడు. ఈ శ్రమలను అనుభవించడానికి ప్రజలను సిద్ధం చేయడమే యిర్మీయా పని. కాని ప్రజలు అతని సేవలను అంగీకరించలేదు. అతని వుపదేశాన్ని వినలేదు. అతని బాధలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అప్పడతనికి నిరుత్సాహం కలిగింది. ప్రవక్తగా తన బాధ్యతను వదలి వేద్దామనుకొన్నాడు. ప్రజలకు ప్రభువు సందేశం విన్పించడం మానివేద్దామనుకొన్నాడు. కాని యిూలా మానివేద్దామనుకొన్నామానివేయలేక పోయాడు. ఆ సందర్భంలో అతడు పల్మిన వాక్యమిది.

2. ప్రజలు ప్రవక్త బోధ వినలేదు. అతన్ని హింసించి బాధించారు - 20,8. అతని నోరు మూయింప జూచారు. కనుక యిర్మీయాకు నిరాశ కలిగింది. ఇకమిూదట ప్రభువు సందేశం చెప్పకుండ వుంటాననుకొన్నాడు. కాని అతడు తనలో తాను ఈలా నిశ్చయించుకొని మెదలకుండ వుండిపోలేదు. తన వద్దేశాన్ని ప్రభువుకి తెలియజేసాడు. అతని ముందు మనసు విప్పి మాట్లాడాడు. ప్రార్ధనారూపంలో తన గోడు ప్రభువుకి విన్పించుకొన్నాడు.

యిర్మీయా తన మనసులోని భావాన్ని ప్రభువుకి విప్పి చెస్తే ఏం జరిగింది? ప్రభువు వాక్కు అతని హృదయంలో అగ్నిలా మండజొచ్చింది. కుమ్మరి ఆవంలాగ అతని హృదయం గనగన మండింది. ఎన్ని కష్టాలొచ్చినా సరే ప్రభువు సందేశాన్ని మాత్రం విన్పించి తీరాలి సుమా అనే కోరిక అతని అంతరాత్మలో మొలకెత్తింది. ఆ భక్తుడు తన హృదయంలోని దివ్యవాక్కునీ ఆ వాక్కుని ప్రకటించాలనే కోర్మెనీ అణచివేయ జూచాడు. కాని ఆ వాక్కు అతనికి లొంగలేదు. అతి ప్రభువు వాక్కు కదా! కనుక అది యేదో విధంగా అతని గుండెలు చీల్చుకొని బయటికి రాబోయింది. అతనికి లొంగకుండా అతని నోటివెంట వెలుపలికి దుముకబోయింది. ఇక అతడు ప్రభువు వాక్యాన్ని తన హృదయంలో అదిమిపట్టి వుంచలేకపోయాడు. దాన్ని ప్రకటించక తప్పదని గ్రహించాడు. ప్రభువు పేరు విూదుగా బోధచేసి తీరవలసిందేనని నిర్ణయించుకొన్నాడు. ఈ సంగతిని ప్రభువుతో