పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/268

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంచించాడని నుడువుతున్నాడు. ఈ సందర్భంలో ప్రవక్త వాడిన "మోసగించు" అనే క్రియకు హిబ్రూ భాషలో చెరచడం, మోసగించడం అనే రెండర్గాలు వున్నాయి.

2. ఈ వుపమానం భావం ఇది. ఓ పురుషుడు ఓ కన్యను నమ్మించాడు. ఆమె అతని మాటలు విని మోసపోయింది. కడన అతడు ఆమెను చెరచాడు. ఆమె నా తెలివితక్కువ తనం వల్లనే నేను నష్టపోయాను కదా అని విచారించింది. ప్రభువు కూడ తనతో ఈలాగే ప్రవర్తించాడని యిర్మీయా భావం. కాని ప్రభువు అతన్ని ఏలా మోసగించాడు? ఏలా చెరిచాడు?

యిర్మీయాకు ప్రవక్త కావాలన్న కోరిక ఏమిూలేదు. అతడు లేత ప్రాయంలో వున్నపుడే ప్రభువు అతన్ని ప్రవచనం చెప్పడానికి పిల్చాడు. యిర్మీయా అందుకు అంగీకరించలేదు. నేను బాలుణ్ణి. ఏలా మాటలాడాలో నాకు తెలియదు అని తప్పించుకోజూచాడు– 1,6. ప్రజలు తన మాటలు వినరనీ తన్ను నానా హింసలకు గురిచేస్తారనీ యిర్మీయాకు తెలుసు. కనుకనే అతడు ఆ పనినుండి తప్పకోజూచాడు.

కాని ప్రభువు అతన్ని వదిలిపెట్టలేదు. నీవు మాతృగర్భంలో రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొన్నాను. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించాను. ఇప్పడునీవు నేను బాలుజ్ఞని చెప్పవద్దు. నేను పంపేవాళ్ళ వద్దకు నీవు వెళ్లాలి. నేను చెప్పమన్న సంగతులన్నీ వాళ్ళకు చెప్పాలి. నేను నీకు తోడుగా వుండి నిన్ను కాపాడుతూంటాను. నీవు భయపడ నక్కరలేదు అన్నాడు - 1,5,8. ఈ విధంగా ప్రభువు అతన్ని నమ్మించి ప్రవక్తను చేసాడు. పైగా అతడు తన పలుకును తీసి యిర్మీయా నోటిలో పెట్టాడు. అతనగా అతన్ని ప్రవక్తగా ధ్రువపరచాడు– 1,9.

ఇదంతా చాలదో అన్నట్లు ప్రభువు అతనితో నేను నిన్ను సురక్షిత నగరంలాగాను, ఇనుప స్తంభం లాగాను, ఇత్తడి తలుపులాగాను చేస్తాను. శత్రువులు నిన్నెదిరిస్తారు గాని జయించేలేరు. నేను నీకు తోడుగా వుండి నిన్ను కాపాడుతూంటాను అని అభయమిచ్చాడు - 1,18-19. ఈ మాటలన్నీ నమ్మియిర్మీయా ప్రభువు ప్రవక్త కావడానికి అంగీకరించాడు. దేవుడు తన్ను కాపాడతాడులే అనుకొన్నాడు. కాని తీరా రాజులూ నాయకులూ ప్రజలూ తన్ను హింసించడానికి పూనుకోగా ప్రభువు అతనికి సాయంజేయడానికి రావడం లేదు. అతడు ఏకాకి అయ్యాడు. కనుక ప్రవక్త విసిగిపోయి ప్రభువు తన్ను మోసగించాడనీ, చెరచాడనీ ఫిర్యాదు చేసాడు. మొదట తన్ను నమ్మించి ఇప్పడు గోతిలో త్రోసాడని పల్మాడు. తన తెలివితక్కువతనం వల్లనే తాను నాశమై పోయానని దుఃఖించాడు. బాధల్లో వున్నవాళ్లు ఎవరైనా ఈలాగే మాట్లాడతారు కదా!

3. ప్రభువు మిూద సుమ్మర్లు పడ్డంవేరు. నిరాశ చెంది అతన్ని పరిత్యజించడం వేరు. యిర్మీయా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని విడనాడలేదు. "ప్రభూ! బాలాఢ్యుడవూ వీరుడవూ ఐన నీవు నా పక్షాన వున్నావు. నన్ను హింసించే వాళ్ళు ఓడిపోయి