పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/266

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓ వైపున ప్రజలు మూరులై ప్రవక్తను హింసిస్తారు. యిర్మీయాను ఈలాగే హింసించారు. మరోవైపున దేవుని కోపం అతని మిూద రగులుకొంటుంది. అతడు తాను చేయని పాపాల కొరకు శిక్షను అనుభవించవలసి వస్తుంది. పూర్వం బాధామయ సేవకుడు ఈలాగే ప్రజల కొరకు శిక్షను అనుభవించాడు. "ప్రభువు మనందరి దోషాలను అతనిపై మోపాడు" — యొష 53,6. కనుక ప్రభువు కోపకాలం ప్రవక్తకు పరీక్షకాలం. అతడు రేయింబవళ్ళు ప్రజలకు కావలివాడుగా మెలుగుతుండాలి - యెహె 33,7.

3. పైన అబ్రాహాము, మోషే, యీర్మీయా, యెహెజ్కేలు మొదలైన ప్రవక్తల విజ్ఞాపన ప్రార్థనలను పరిశీలించాం. ఈ మహానుభావులంతా ప్రజల పట్ల బాధ్యత కలవాళ్లు, కనుక తమ బాధ్యతకొద్ది వాళ్లు ప్రజల కొరకు విన్నపాలు చేసారు. మనం కూడ ఏయే బృందాలకు బాధ్యులమో వారి తరపున దేవునికి విన్నపాలు చేయాలి. సైనికులు కన్నం బడకుండా కోటగోడను కాపాడినట్లే మనంకూడ మన ప్రార్థనలతో మన జనాన్నికాపాడాలి. ఇది మన పూచీ.

అబ్రాహాము మోషే మొదలైనవాళ్లు దేవుని స్నేహితులు, దైవభక్తులు. కనుక ప్రభువు వాళ్ల మనవిని సత్వరమే ఆలించాడు. మన భక్తిని బట్టీ, పుణ్య జీవితాన్ని బట్టీ, దేవుడు మన మనవిని వింటాడు. మన తరపున మనం భక్తితో జీవించాలి.

మనం మొదట మన అధీనంలో వున్న ప్రజల కొరకు విన్నపాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు మనం కావలివాళ్ళం. అటుపిమ్మట అందరు ప్రజల కొరకు దేవుణ్ణి వేడాలి. దేవుడు ప్రధానంగా కోరేది సోదర ప్రేమ. ఈ యాజ్ఞ వల్ల మనం ఎల్లరి కొరకు ప్రార్ధన చేయ బాద్యులం

4. దేవుని పట్ల నిజాయితీ

25. వట్టిపోయిన నది - యిర్మీ 15, 18.

1. దేనిపట్ల మనకున్న నిజాయితీ ఏపాటిదా అని భక్తులు ఎప్పడూ తమ్ముతాము పరిశీలించి చూచుకొంటూండాలి. మనం ప్రభువుతో మనసు విప్పి మాట్లాడుతూండాలి, మన కష్టసుఖాలను ప్రార్ధనారూపంలో అతనితో చెప్పకొంటూండాలి. యిర్మీయా ఈలా చేసాడు. ఇక్కడ ప్రవక్త తన దైవసేవను గూర్చి తలపోసికొంటూన్నాడు. ఒకప్పడు దైవవాక్కు తనకు విన్పింపగా దాన్ని భుజించి ఆనందించాడు - 15,18. అప్పడు ప్రభువు తనకు దగ్గరగా వున్నట్లే అనిపించింది. దేవుడు తన్ను ప్రవచనం చెప్పడానికి పిల్చాడని నమ్మాడు. కాని యిప్పడు తాను కష్టాల్లో చిక్కుకొంటే ప్రభువు తన్ను పట్టించుకోవడం లేదు. వేసవి రాగానే వట్టిపోయిన నదిలాగ అతడు నమ్మదగనివాడుగా కన్పిస్తున్నాడు. ప్రభువు తనకు జీవజలాల బుగ్గలాంటివాడు కావడంలేదు - 15, 18.