పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/265

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుక యూధా ధైర్యంగా శత్రువులను ఎదుర్కోవచ్చు. యూద సైనికులును అతని పక్షాన్ని అవలంబించి గ్రీకులతో పోరాడవచ్చు. విజయం వారిదేనని భావం.

3. ఓనియాసు యిర్మీయా చాలాకాలం పాటు యూదులకు సేవలు చేసినవాళ్లు, చనిపోయాక గూడ ప్రజల కొరకు విజ్ఞాపనం చేసారు. ఈ మహానుభావులు నేడు మన విజ్ఞాపనకు ఆదర్శంగా వుంటారు. మనం ఏ ప్రజల కొరకు కృషి చేస్తున్నామో, వారి కొరకు దేవునికి విజ్ఞాపనం చేస్తుండాలి. విద్యాసంస్థల్లో ఆస్పత్రుల్లో సాంఘిక సేవా సంస్థల్లో పనిచేసేవాళ్లు అక్కడివారి కొరకు దేవునికి మనవి చేయాలి. విచారణల్లో పనిజేసేవాళ్లు అక్కడి ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎవరితో కలసి జీవిస్తున్నామో వారికొరకు మొట్టమొదట జపం చేయాలి. అటుపిమ్మట మన బంధుమిత్రులూ ஒ88 పనివాళూ సహచరులూ మొదలైన వాళ్లందరి కొరకూ ప్రార్థన చేయాలి. ఎప్పడూ ఇతరుల విూద మనకు గల ప్రేమా, ఇతరుల కొరకు మనం చేసే ప్రార్ధనా కలసిపోతూండాలి.

24 యెహెజ్కేలు విజ్ఞాపనం - యెహె 22, 30

1. యెహెజ్కేలు మంచి ప్రవక్తల లక్షణాలు చెప్తున్నాడు. యుద్ధకాలంలో మంచి సైనికులు కోటగోడకు కావలి కాస్తారు. శత్రువులు దానిలో కన్నం వేయకుండా వుండేలా జాగ్రత్త పడతారు. ఒకవేళం కన్నం పెడితే దాన్ని వెంటనే పూడుస్తారు. అలాగే మంచి ప్రవక్త ప్రభువు కోపకాలంలో జాగ్రత్తగా వుంటాడు. ప్రభువుశిక్ష ప్రజల విూద పడకుండ వుండేలా చూస్తాడు. ప్రజల కొరకు ప్రార్థన చేసి దేవుని కోపాన్ని తొలగిస్తాడు.

2. యుద్ధకాలంలో సైనికులు నగర ప్రాకారానికి కావలి కాస్తారు. శత్రువులు దానికి కన్నం పొడిచి కోటలోనికి ప్రవేశింపజూస్తారు. కనుక సైనికుల సర్వశక్తుల ఆ గోడను కాపాడజూస్తారు. ఒకవేళ విరోధులు గోడకు కన్నం పొడిస్తే శౌర్యవంతులైన సైనికులు ఆ రంధ్రం దగ్గరే నిల్చుండి విరోధులను ఎదుర్కొంటారు. ప్రాణాలకు తెగించి పోరాడతారు. సాధ్యమైనంత త్వరలో రంధ్రాన్ని పూడుస్తారు.

ఇక్కడ యిప్రాయేలీయుల విూదికి ఎత్తివచ్చే శత్రువు ప్రభువే. వాళ్ళు అతని యాజ్ఞలు విూరారు కనుక పూర్వం వారికి రక్షకుడుగా వున్న ప్రభువే ఇపుడు శిక్షకుడుగా మారిపోతాడు. కనుక ప్రభువ “నేనే మియాకు శత్రువు నౌతాను. నా కత్తిదూసి మియాలో మంచివారినీ చెడ్డవారినీ గూడ వధిస్తాను" అని పల్మాడు - యెహె 21, 3-4.

ఈ పరిస్థితుల్లో ప్రవక్త మంచి సైనికుల్లాగ ప్రజలను రక్షించాలి. అతడు ప్రజల తరపున ప్రభువుకి ప్రార్థన చేయాలి. దేవుడు తన కోపాన్ని ఉపసంహరించుకొని శాంతచిత్తుడు కావాలని మనవి చేయాలి. ప్రజలు తమ పాపాలకు పశ్చాత్తాప పడుతున్నారు. కనుక ప్రభువు వారిని శిక్షింపక వదలివేయాలని విజ్ఞాపనం చేయాలి.