పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని ప్రభువిచ్చిన ఈ సమాధానం యోహానాను బృందానికి నచ్చలేదు. వాళ్లు మొట్టమొదట యిర్మీయా తెలియజేసిన ప్రభువు చిత్తానికి కట్టుపడి వుంటామని ప్రమాణం చేసారు. కాని కడన తమ మాట నిలబెట్టుకోలేదు. ప్రభువు చిత్తానికి విరుద్ధంగా ఈజిప్టుకు వెళ్ళిపోయారు. యిర్మీయాను కూడ బలవంతంగా తమ వెంట లాగుకొనిపోయారు — 43,6. ఇదివాళ్ళ దుష్టవర్తనం.

3. మనం విజ్ఞాపన ప్రార్థన చేసేపుడు ప్రజల తరపున దేవునికి విన్నపాలు చేస్తాం. ప్రజల పక్షాన దేవుని యెదుట మధ్యవర్తిగా నిలబడతాం, ఈసమయంలో మన లాభం మనం చూచూకోగూడదు. ఎవరి తరపున ప్రభువికి మనవి చేస్తున్నామో వారి ప్రయోజనాన్ని మాత్రమే లెక్కలోకి తీసికోవాలి. ఒకోసారి మనం ప్రార్థన చేస్తే జనం మన మాట వినరు. మన విూద తిరగబడతారు. మనకు కీడు చేయగోరతారు కూడ. ఐనా మనం మాత్రం చిత్తశుద్ధితో, స్వార్థం లేకుండా, వాళ్ళ తరపున ప్రార్ధన చేయవలసిందే. పైన పేర్కొన్న వేదవాక్యాల్లో యీర్మియా ఈలాగే ప్రవర్తించాడు.

23. ఓనియాసు విజ్ఞాపనం - 2 మక్క 15,11-16

1. అంటియోకస్ ఎపిఫానీస్ అనే గ్రీకురాజు యూదులను హింసింపసాగాడు. యూదజాతినీ వారి నగరాన్నీ దేవాలయాన్నీ నాశం చేయాలని అతని కోరిక, యూదా మక్కబీయుడు ఆ రాజును ఎదిరించి ధైర్యంగా పోరాడసాగాడు. అంటియోకస్ రాజు నికానోరు అనే సైన్యాధిపతిని యెరూషలేము మిూదికి పంపాడు. యూదా అతనితో యుద్దానికి తలపడ్డాడు. ఆ సందర్భంలో అతడు తన సైనికులకు ధైర్యం కలగడానికి తాను చూచిన ఓ దర్శనాన్ని వారికి ఈ క్రింది రీతిగా వివరించి చెప్పాడు.

2. ఓనియాసు అనే భక్తి గల ప్రధాన యాజకుని గ్రీకులు హత్య చేసారు. ఈ ఓనియాసు గ్రీకుల విూద యుద్దానికి తలపడిన యూదాకు దర్శనంలో కన్పించాడు. అతడు చేతులు చాచి యూదజాతి కొరకు దేవునికి మనవిచేస్తున్నట్లుగా కన్పించాడు. యూదా తన్మయత్వంతో అతనివైపు చూస్తున్నాడు. అంతలో ఆ దర్శనంలో మరో వ్యక్తి కన్పించాడు. అతడు వృదుడు.టివి తేజస్సూ కలవాడు. ఓనియాసు ఆ రెండవ వ్యక్తిని యూదాకు పరిచయం చేసూ ఇతడు యిర్మీయా ప్రవక్త. యూదులను గాఢంగా ప్రేమించేవాడు. ఆ ప్రజల కొరకూ పరిశుద్ధ నగరం కొరకూ ప్రార్థన చేసేవాడు అని చెప్పాడు. అప్పడు యిర్మీయా తన కుడిచేతిని చాచి సువర్ణ ఖడ్డాన్ని యూదాకు బహూకరించాడు. ఈ కత్తిని దేవుడే నీకు కానుకగా పంపాడు. నీవు దీనితో శత్రువులను హతమార్చు అని చెప్పాడు. ఇది దర్శనం. యూదాకు దైవబలముందని ఈ దర్శనం భావం. భక్తులైన ఓనియాసు యిర్మీయా మొదలైనవాళ్ళ అతని తరపున ప్రార్ధనం చేస్తున్నారు.