పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/263

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుండి పుట్టబోయే నూత్న జాతియెందుకు? కనుక అతడు ప్రజలను కాపాడమని ప్రభువుకి విన్నపం చేసాడు. ఒకవేళ దేవుడు తన మొరను ఆలించకపోతే తన పేరును జీవగ్రంథం నుండి కొట్టివేయమని కోరాడు - 32,32. స్వార్థం లేని, ప్రేమతో గూడిన ఆ మహాభక్తుని ప్రార్థనను ప్రభువు ఆలించాడు. ఈలాగే మనంకూడ స్వార్థం లేకుండ తోడి ప్రజలను ప్రేమించినపుడు వారి కొరకు మంచి విజ్ఞాపనను చేస్తాం. దేవుడు మన మనవిని ఆలిస్తాడు. ఇరుగుపొరుగువారి కొరకు విజ్ఞాపనం చేసేపుడు మోషేను మనం ఆదర్శంగా తీసికోవాలి.

22. యిర్మీయా విజ్ఞాపనం - యిర్మీ 42,1-6

1. యిర్మీయా కాలంలో పాలస్తీనా దేశపు రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలంగా వుండేవి. 587లో బాబిలోనియా రాజైన నెబుకద్నెసరు యూదులను ఓడించి యెరూషలేమనీ దేవాలయాన్నీ తగలబెట్టాడు. యూదులను బాబిలోనియాకు బందీలనుగా కొనిపోయాడు. కొందరు పేదజనులూ యిర్మీయా ప్రవక్తా పాలస్తీనా దేశంలోనే వుండిపోయారు. బాబిలోనీయులు యూదాకు అధికారిగా నియమించిన గెదల్యాను యిష్మాయేలు చంపివేసాడు. యోహానాను అతని అనుచరులు ఈ యిష్మాయేలును పట్టుకోజూచారు. కాని అతడు తప్పించుకొని పారిపోయాడు. అటుతర్వాత యోహానాను బృదంవాళ్ళు గెదల్వా వధకు బాబిలోనీయులు తమ్ము శిక్షిస్తారేమోనని భయపడి ఈజిప్టుకి పారిపోగోరారు. కాని అలా పారిపోక ముందు వాళ్లు యిర్మీయాను ప్రార్థన చేసి దేవుని చిత్తమేమిటో తెలిసికొమ్మని అడిగారు. ప్రవక్త వారి తరపున విజ్ఞాపనం చేయడానికి అంగీకరించాడు.

2. యోహానాను బృందం ప్రవక్త తెలియజేసిన దేవుని చిత్తానికి కట్టుపడి వుంటామని బాస చేసింది. వారి భావాల ప్రకారం ప్రవక్త ఓవైపున దేవుని మనిషీ, మరోవైపున ప్రజల మనిషీకూడ. అతడు దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్నితెలిసికొనేవాడు. దేవుడే అతనికి తన సంకల్పాన్ని తెలియజేస్తాడు. ఆ దైవసంకల్పాన్ని అతడు ప్రజలకు తెలియజేస్తాడు. అతడు దేవుని 'నోరు", అనగా దేవుని సందేశాన్ని ప్రజలకు తెలియజెప్పేవాడు.

ప్రవక్త ప్రజల మనిషికూడ. అతడు ప్రజల కష్టసుఖాలనూ సమస్యలనూ గ్రహిస్తాడు. వాటిని దేవునికి విన్నవిస్తాడు. ప్రజల ప్రతినిధిగా దేవుని ముందు నిలుస్తాడు. దేవునికి మానవులకీ నడుమ మధ్యవర్తిగా వుంటాడు. దేవుడిచ్చే జవాబుని స్వీకరించి ప్రజలకు తెలియజేస్తాడు. ఈ కారణాల వల్లనే ఇక్కడ ఈ యూదబృందం యిర్మీయాను ప్రార్థన చేయమని అడిగింది.

యిర్మీయా మనవి చేయగా దేవుడు పదిరోజులైన పిమ్మట అతనికి జవాబిచ్చాడు - 42.7. ప్రభువు సమాధానమేమిటంటే, యోహానాను బృందం ఈజిప్టుకు పారిపోగూడదు. యూదా దేశంలోనే వండిపోవాలి. బాబిలోనీయుల బారినుండి ప్రభువే వారిని కాపాడతాడు.