పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/259

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోడివారిని ప్రేమతో చూడమని గూడ చెపున్నాడు. ప్రభువు యిస్రాయేలీయులందరితోను సీనాయి కొండదగ్గర నిబంధనం చేసికొన్నాడు. ఈ నిబంధనం ద్వారా యూదులు దేవుణ్ణి కొలిచే జనమూ అతని బిడ్డలూ అయ్యారు. కనుకనే ఒకే తండ్రి బిడ్డలైన యూదులు ఒకరికొకరు తోబుట్టువుల్లాంటివాళ్ళు కనుక వాళ్ళకు పరస్పరప్రేమ అవసరం.

భక్తుడు దేవునిపట్ల వినయాన్ని ప్రదర్శించాలి. అనగా దేవుని విూద ఆధారపడి జీవించాలి. గర్వాత్ముడు నాకు నేను చాలుదును అనుకొంటాడు. స్వీయబలం విూదనే ఆధారపడతాడు. వినయాత్మడు నాకు నేను చాలను దైవబలం కావాలి అనుకొంటాడు. చిన్నబిడ్డడు తల్లిదండ్రుల విూద లాగ దేవుని మిూద ఆధారపడతాడు. తానర్పించే బలుల విూదా, తాను చేసే పూజలవిూదా కాక దేవుని కృప విూదనే ఆధారపడి జీవిస్తాడు. ఫలితాంశమేమిటంటే, హృదయంలో సోదరప్రేమా దైవభక్తి వుంటేనే గాని దేవునికి ప్రీతి కలిగించలేం. వట్టి బహిర్గత మతం చాలదు. అంతర్గత మతం కావాలి.

3. దేవుడు మనకంటె గొప్పవాడు. దోషాలు లేనివాడు. సర్వ సంపూరుడు. కనుక అతన్ని పూజించడం, ప్రేమించడం సులువు. తోడి నరులు మనలాంటివాళ్ళు మనలోని దోషాలే వాళ్ళల్లో గూడ కన్పిస్తాయి. కనుక వాళ్ళను ప్రేమించడం కష్టం. ఐనా తోడి జనాన్ని అంగీకరించి ప్రేమిస్తేనే గాని దేవుణ్ణి మెప్పించలేం. నేడు అతడు మనకు నేరుగా దర్శనమిూయడు. తోడి నరుల్లోనే దర్శనమిస్తాడు. కనుక తోడి జనులను ప్రేమిస్తే అతన్ని ప్రేమించినట్లే.

19. నా పొరుగువాడు ఎవడు? లూకా 10,29-37

1. మంచి సమరయుని కథ మన కందరికీ తెలిసిందే. మోక్షం పొందాలి అంటే నేనేమి చేయాలి అని ధర్మశాస్త్ర బోధకుడు క్రీస్తుని ప్రశ్నించాడు. ఈ విషయమై ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని క్రీస్తు అతనికి ఎదురు ప్రశ్నవేసాడు. ఆ బోధకుడు ధర్మశాస్త్రం దేవుణ్ణి పొరుగువార్టీ ప్రేమించమని చెప్తుంది అని పల్కి ఇక్కడ పొరుగువాడంటే ఎవరో తెలియజేయమని క్రీస్తుని అడిగాడు. దానికి సమాధానంగా క్రీస్తు అతనికి మంచి సమరయుని కథను చెప్పాడు. ఈ కథలోని మంచి సమరయుడు కారుణ్యానికి పెట్టింది పేరు. అతని ప్రవర్తనను జాగ్రత్తగా గమనించి మనం కూడ సోదర ప్రేమను అలవర్చుకోవాలి.

2. బాటసారి దొంగలచే దెబ్బలు తిని కొనవూపిరితో త్రోవ ప్రక్కన పడివున్నాడు. యాజకుడు, లేవీయుడు సమరయుడు అనే ముగ్గురు ఆ త్రోవ వెంట వచ్చారు. తొలి యిద్దరూ బాటసారిని పట్టించుకోలేదు. మూడవవాడు పట్టించుకొన్నాడు. క్రీస్తు అతన్ని మనకు ఆదర్శంగా చూపించాడు.

బాటసారి త్రోవ ప్రక్కన పడివున్నాడు. దారికి రెండు ప్రక్కలు వుంటాయి కదా? యాజకుడూ లేవీయుడూ బాటసారి పడివున్న ప్రక్కగానే వచ్చారు. కాని అతని దగ్గరికి