పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/257

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గెత్సెమని తోపులో ప్రభువు ప్రార్ధించింది తన చిత్తానికీ తండ్రి చిత్తానికీ మధ్య ఏర్పడిన ఘర్షణను పరస్కరించుకొనే. ఈ ఘర్షణంలో ప్రభువు తండ్రికి విధేయుడయ్యాడు. తండ్రీ! నా యిష్టప్రకారం గాదు, నీ యిష్టప్రకారమే జరగనీయి అన్నాడు.

3. ప్రార్థనలోని ముఖ్యాంశం ఇదే. దేవుణ్ణి మన చిత్తానికి లొంగదీసికొనే ప్రయత్నం చేయకూడదు. మనమే అతని చిత్తానికి లొంగాలి. ఇక్కడ క్రీస్తు చేసింది యిదే. మనం దైవచిత్తానికి లొంగితే మన హృదయంలో శాంతి నెలకొంటుంది. అలా లొంగకపోతే మన మనస్సులో శాంతి వుండదు. మన అంతరాత్మే మనలను పీడిస్తుంది.

కాని దేవుని చిత్తానికి లొంగడం కొన్నిసార్లు కష్టమౌతుంది. అది మన స్వార్ణానికి వ్యతిరేకంగా పోతుంది. కనుక ఆ కార్యం మనకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఒకోసారి మన ప్రాణాలుకూడ అర్పింపవలసి వుంటుంది. ఐనా తప్పదు. దేవుడు నరునిచిత్తానికి లొంగడు. నరుడే దేవుని చిత్తానికిలొంగాలి. మనరక్షణం ఈ రహస్యంలోనే ఇమిడివుంది. కనుక పిత చిత్తానికి లొంగిన క్రీస్తు మనకు ఎల్లవేళలా ఆదర్శంగా వుంటాడు.

{center|

2. సోదర ప్రేమ

}

17. యావే మందిరంలో అతిథి = కీర్త 15

1. 15వ కీర్తన సాంఘిక న్యాయాన్ని గూర్చి చెప్తుంది. నరుడు తోడి నరుడిపట్ల యేలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. నరుడు భగవంతునికి ప్రీతి కలిగించాలంటే కేవలం ఆరాధనం ఒక్కటే సరిపోదు. తోడివారి పట్ల నీతితో ప్రవర్తించడం గూడ అవసరం. యావే మందిరంలో ప్రవేశించాలంటే యేలాంటి అర్హత వుండాలని ఈ కీర్తనం లోని మొదటి చరణంలో యాత్రికుడు యాజకుణ్ణి ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు యాజకుడు జవాబు చెప్తాడు. దేవళంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలవడానికి కావలసిన అర్హతలను అతడు వరుసగా పేర్కొంటాడు.

2. రెండవ చరణం నుండి యాజకుడు భక్తునికి వుండవలసిన గుణాలను వివరించాడు, అవియివి నిందా రహితంగా జీవించడం

ధర్మాన్ని పాటించడం

సత్యం పల్మడం

చాడిలు చెప్పకుండా వుండడం

స్నేహితునికి కీడు తలపెట్టకుండడం

ఇతరుల విూద నిందలు మోపకుండడం
దేవుణ్ణి పూజించనివారిని తిరస్కరించడం 

భక్తిపరులను గౌరవించడం చేసిన ప్రమాణం నిలబెట్టుకోవడం వడ్డీ తీసికోకపోవడం లంచం పట్టకపోవడం