పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/251

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం మేరమీరిన కృతజ్ఞతా భావంతో, భక్తిపారవశ్యంతో దేవుణ్ణి స్తుతించాలి. ఆ రాజులాగే మనంకూడ ప్రభూ! నీవు నన్నింతగా గౌరవించడానికి నేనేపాటి వాణ్ణి? ఇక నేను విన్నవించుకోదగ్గ దేముంది? నీవు నన్ను దీవిస్తే నేను కలకాలం బ్రతికిపోతాను అని వినయంతో విన్నవించుకోవాలి. ఈలా మన కష్టసుఖాల్లోను మనసువిప్పి దేవునికి ప్రార్ధన చేయాలి. అంతేగాని దేవునినుండి నానా భాగ్యాలు స్వీకరించిన పిదప గూడ మూగెద్దులా మౌనంగా వుండిపోకూడదు. పైపెచ్చునా సామర్థ్యంవల్ల నేనే ఈ విజయాలన్నీ సాధించానని గర్వంతో పొంగిపోకూడదు. మనకున్నవన్నీ దేవుడిచ్చినవే. మన సొంతం ఏమైనా వుంటే అవి మన పాపాలు మాత్రమే.

10. దావీదు పశ్చాత్తాపం -2 సమూ 12, 1-14.

1. దావీదు ఊరియా అనే సైనికుని భార్య బత్తెబాను మోహించాడు. ఊరియాను మోసంతో యుద్ధంలో మొదటి వరుసలో పెట్టించి చంపించాడు. బత్తెబాను తన యింటికి తీసికొని వచ్చి తన భార్యను చేసికొన్నాడు. కాని అతడు చేసినపని ప్రభువుకి కోపం తెప్పించింది —11,27. యావే అతన్ని మందలించడానికి నాతాను ప్రవక్తను పంపాడు. నాతాను రాజుకి పశ్చాత్తాపం కలిగించడానికి ఒక నీతికథను అల్లుకొనివచ్చాడు.

2. అతడు రాజుతో అయ్యా! ఓ నగరంలో ఓ ధనవంతుడు ఓ పేదవాని గొర్రెపిల్లను బలాత్కారంగా తీసికొని తన చుట్టానికి విందు చేయించాడు చూచావా అని చెప్పాడు, దావీదు అలాంటి దుష్కార్యానికి వొడిగట్టినవాడు ప్రాణాలు కోల్పోవాలి అన్నాడు. అతడు నాల్లవంతులు నష్టపరిహారం చెల్లించుకోవాలి అన్నాడు. వెంటనే నాతాను అందుకొని ఆ దుర్మారుడివి నీవే. నీకు ఇందరు భార్యలుండగా ఊరియా భార్యను ఎందుకు అపహరించావు? ఊరియాను అన్యాయంగా యుద్ధంలో ఎందుకు చంపించావు?అని ప్రశ్నించాడు. ప్రభువు దావీదు కుటుంబంలో అంతఃకలహాలు పుట్టిస్తాడనీ, అతని భార్యలు మానభంగానికి గురౌతారనీ చెప్పాడు.

బలహీనతవల్ల పాపం చేసినా దావీదు మంచి రాజు. అతడు తన్నుతాను సమర్ధించుకోలేదు. తన తప్పను తెలిసికొని పశ్చాత్తాపపడ్డాడు. నేను యావేకు ద్రోహంగా పాపం చేసాను అని వొప్పకొన్నాడు. నరహత్య వ్యభిచారం చేసినందుకు దావీదు ప్రాణాలు కోల్పోవాలి. ఈ శిక్షను దావీదే స్వయంగా ప్రకటించాడు– 12,5-6. ఐనా అతడు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడ్డాడు కనుక ప్రభువు అతన్ని బ్రతకనిచ్చాడు. అతనికి బత్తెబాకు పుట్టిన బిడ్డడు మాత్రం మరణిస్తాడు - 12, 13-14.

ఈ సంఘటనంలో నాతాను దావీదుని దేవునిమందు నిలబెట్టాడు. దేవుని వాక్యం దావీదు తప్పను ఖండించి అతని మీద శిక్షను ప్రకటించేలా చేసాడు. మామూలుగా నరులు పాపంజేసి దేవుని శిక్షను తప్పించుకోజూస్తారు. దేవుని కంటబడ్డానికి జంకుతారు. పూర్వం ఆదిదంపతులు పాపంజేసి దేవుని యెదుటికి రాకుండా చెట్లనడుమ దాగుకొన్నారుఆది 3,8. కాని యిక్కడ దావీదు ఈలా చేయలేదు. అతడు చిత్తశుద్ధితో తన తప్పని