పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/248

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చితకగొట్టి కసి తీర్చుకొంటాడో అని భయపడ్డాడు. ఆ సందర్భంలో అతడు దేవునికి ప్రార్థన చేసాడు.

2. పద్దనారామునుండి స్వదేశంలోని చుట్టాల దగ్గరికి తిరిగి రమ్మని యాకోబుని ఆజ్ఞాపించింది దేవుడే - 32, 9. కనుక తన తిరుగు ప్రయాణంలో తన్ను సురక్షింతంగా కాపాడే పూచీ దేవునిదే. పైగా అతని సంతానం సముద్రపుటిసుకవలె లెక్కల కందని రీతిగా విస్తరిల్లుతుందని గూడ దేవుడే ప్రమాణం చేసాడు - 32, 12. మరి యిప్పడు ఏసావు తన్ను చంపివేస్తే దేవుని ప్రమాణం ఏలా నెరవేరుతుంది? కనుక ఏసావు దెబ్బనుండి తన్ను కాపాడే పూచీగూడ దేవునిదే. పై యాకోబు ప్రార్థనలో ఈ రెండు భావాలు నిగూఢంగా వున్నాయి.

దేవుడు యాకోబు మొర ఆలించాడు. ప్రభువు ఏసావుని యాకోబుపట్ల ప్రసన్నుద్ధి చేసాడు. కనుక అతడు తమున్ని ప్రేమతో ఆదరించాడు. అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు పోయి అనురాగం చోటుచేసికొంది.

3. ఈ యాకోబులాగే మనంకూడ ఆపదల్లో నమ్మకంతో దేవుణ్ణి శరణువేడాలి. ఆ ప్రభువు మన బాధలు తీర్చేవాడు. మన శ్రేయస్సును కోరేవాడు. కనుక వినయంతో, నమ్మకంతో, భక్తిభావంతో మన కష్టాలను అతనికి తెలియజేసికోవాలి. మన తరపున మనం ఈలా తెలియజేస్తే మీదటి సంగతిని అతడే చూచుకొంటాడు.

7. మోషే మనవి - సంఖ్యా 11, 10-15.

1. యిప్రాయేలీయులు తలబిరుసు ప్రజలు. వాళ్లు ఎప్పడూ యావేమీదా అతని బంటయిన మోషేమీదా తిరగబడుతూనే వుంటారు. అతడు అనిష్టంతోనే ఆ ప్రజలకు నాయకుడయ్యాడు. నాయకుడైనప్పటినుండి ప్రజలు అతన్ని తిప్పలు పెడుతూనే వచ్చారు. ఇబ్బందులు ఎదురైనపుడల్లా వాళ్ళ దేవునిమీద మోషేమీదా తిరగబడి నిష్ణురాలు పల్మేవాళ్ళు మీరు మమ్మల్ని ఐగుపునుండి ఎందుకు తీసుకవచ్చారని సుమ్మర్లుపడేవాళ్ళు.

ఎడారిలో కిట్రోతు హట్టావా అనే తావుదగ్గరికి వచ్చినపుడు యిస్రాయేలీయులకు మాంసం తినాలని కోరిక పుట్టింది. వాళ్ళ తలంపులు ఐగుప్తమీదికి వెళ్లాయి. అక్కడ చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, వెల్లుల్లి కడుపార తిన్నాంగదా అనుకొన్నారు. ఎడారిలో దిక్కుమాలిన మన్నా ఒక్కటి దక్క ఇంకేమి దొరకదుకదా అని గొణుగుకొన్నారు — 11,4-6. వారి సణుగుడంతా విని మోషే దేవునికి మనవి చేసాడు.

2. మోషే ప్రజలతో విసిగిపోయాడు. కనుక అతడు ఈ ప్రార్థనలో దేవుణ్ణి చాల ప్రశ్నలు అడిగాడు. ప్రభూ! నీవు నన్నింతగా బాధపెడతా వెందుకు? ఈ జనానికి నేనేమి తల్లినా లేక దాదినా? వీరిని మోయవలసిన బాధ్యత నా కెందుకు? వీళ్ళకు కావలసినంత మాంసంపెట్టి వీళ్ళ కోరిక తీర్చే శక్తి నాకెక్కడిది? - ఇవి మోషే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు దేవుడు జవాబు చెప్పడని మోషేకు ముందుగానే తెలుసు. ఐనా అతడు తన హృదయంలోని వ్యధను దేవునిమందు ఒలకబోసికోకుండా వుండలేకపోయాడు. 240