పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/247

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. 20, 18-38 వచనాలు పౌలు ఎఫెసు పెద్దలకు చేసిన వీడ్కోలు ఉపన్యాసం. కాని అది అతడు స్థాపించిన తిరుసభలన్నిటికీ చెప్పిన తుది సందేశం అనుకోవాలి. అన్యజాతి క్రైస్తవులకు అతడు వ్రాసియిచ్చిన వీలునామా అనుకోవాలి. ఈ వేదభాగంలోని ముఖ్యభావాలు ఇవి. పౌలు మూడేండ్లు కష్టపడి ఎఫెసు పౌరులకు వేదబోధ చేసాడు. పౌలు తర్వాత వాళ్ళు అతని బోధను కలీ చేయకూడదు. అతని సంప్రదాయాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఖండితంగా పాటించాలి. ఎఫెసు పెద్దలు అతన్ని మాల్లా కంటితో జూడరు అతడు ఎవరి సామ్మమీదా ఆధారపడి జీవించలేదు. తన చేతులతో పని జేసికొని పొట్టబోసికొన్నాడు.

పూర్వాంశంలో పౌలు ప్రార్థనా వాతావరణంలో తన పేషితోద్యమాన్ని ప్రారంభించాడని చెప్పాం. ప్రస్తుతాంశంలో అతడు మళ్లా ప్రార్ధనా వాతావరణంలోనే ఆ వుద్యమాన్ని ముగించడాన్ని చూస్తాం. అక్కడ అంటియోకయ ప్రార్థనాబృందం అతన్ని పనిమీద పంపింది. ఇక్కడ ఎఫెసునుండి వచ్చిన ప్రార్ధనా బృందం పనిని విరమిస్తున్న పౌలుకి వీడ్కోలు చెప్పింది. ఆ పెద్దలందరితోపాటు పౌలుకూడ అక్కడే మోకరిల్లి ప్రార్ధించాడు-20,36.

3. మనం దేవుని పేరుమీదిగా ఓ పని ప్రారంభించేపుడూ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్ధన దైవసహాయాన్ని అడుగుకోవడానికి. అటుపిమ్మట దేవుని పేరుమీదిగా ఆ పనిని ముగించేపుడూ ప్రార్ధన చేయాలి. ఈ ప్రార్ధన ప్రభువుకి వందనాలు చెప్పడానికి, మనం ముగించిన పని ఈ నేలమీద పదికాలాలపాటు నిల్చేలా చేయమని దేవుణ్ణి అర్ధించడానికి, మన పనులూ వుద్యమాలూ నిల్చేదీ, కొనసాగేది దైవబలంవల్లనే కదా!

ఇంకా,పౌలు ఎక్కడికి వెళ్లినా ఒక వ్యక్తిగా పనిచేయలేదు. ఒక బృందంగా పనిచేసాడు. అతనివెంట ఎప్పడూ శిష్యబృంద ముండేది. భక్తబృందం గూడ వుండేది. ఇక్కట ఎఫెసు భక్తులను చూచాం గదా! వ్యక్తిగతంగా ప్రేషిత సేవ చేయడం మంచిదే. కాని ఓ బృందాన్ని కూర్చుకొని ఆ సేవచేయడం ఇంకా మంచిది. పదిమంది వున్న కాడ దేవుడుంటాడు.

6. యాకోబు - ఏసావు = ఆది 32, 2-12.

1. యాకోబు మోసగాడు. వంచనతో అన్నకు రావలసిన జ్యేష్ఠభాగం కొట్టేసాడు - 25,29-34. అన్నకు దక్కవలసిన దీవెనను కాజేసాడు - 27, 27-30. అందుకు ఏసావు యాకోబు తిత్తి తీయాలనుకొన్నాడు. కాని తల్లి రిబ్కా అతని కోపు తీసికొంది. ఏసావుకి తెలియకుండా అతన్ని పద్దనారాములోవున్న తన మేనమామ లాబాను వద్దకు పంపింది. యాకోబు అక్కడ మేనమామనుగూడ బోల్లా కొట్టించాడు. అతని యిద్దరు కూతుళ్ళయిన లెయా రాహేళ్ళను పెండ్లియాడాడు. గొర్రెలు గొడ్లరూపంలో అపారమైన ఆస్తి గడించాడు. చాల యేండ్లయిన తర్వాత ఆలుబిడ్డలతో, పసులమందలతో కనాను మండలానికి తిరిగివచ్చాడు. ఏసావు తమ్ముణ్ణి చూడ్డానికి ఎదురువచ్చాడు. అతడు తమ్ముడు చేసిన అపకారాలన్నీ మర్చిపోయి ప్రేమభావంతోనే వచ్చాడు. కాని యాకోబు అన్న తన్నెక్కడ 239