పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది

బృందంలో ఓ అతన్ని ప్రేరేపించింది. తన పనికై పౌలునీ బర్నబానీ పంపాలనీ అతనితో చెప్పించింది.

భక్తులు ఆత్మ పిలుపుని అర్థం చేసికొని అన్యజాతులకు వేదబోధ చేయడానికి పౌలునీ బర్నబానీ పంపారు. అలా పంపేప్పడు గూడ మళ్లా ఉపవాసముండి ప్రార్థనలు చేసారు. ఈ ప్రార్ధనా వాతావరణంలో పౌలు ప్రేషితోద్యమం ప్రారంభమైంది. అది ప్రధానంగా ఆత్మ తలపెట్టిన పని.

పేత్రు మొదలైనవాళ్లు మొదటినుండి యూదులకు క్రీస్తునిగూర్చి బోధిస్తూనే వున్నారు. యూదులు క్రైస్తవ సమాజంలో చేరారుగూడ, కాని అన్యజాతివాళ్లయిన గ్రీకురోమను ప్రజలకు క్రీస్తునిగూర్చి చెప్పడమేలాగన్నది ఆ రోజుల్లో పెద్ద సమస్య అన్యజాతుల నుండి అంతకు ముందే ఇతియోపీయుడు, కొర్నేలి మొదలైనవాళు క్రైస్తవులయ్యారు. కాని వీళ్లు కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రమే. ఈలా కొందరు వ్యక్తులు క్రైస్తవమతంలో చేరితే చాలదు. అన్యజాతి జనులను బృందాలుగా తిరుసభలోనికి తీసికొనిరావాలి. ఈ కార్యాలు ప్రారంభించినవాడు పౌలు. అతనితో అన్యజాతులకు వేదబోధ చేయడమనేది పెద్ద వుద్యమంగా తయారైంది. ఈ చరిత్ర అపోస్తలుల చర్యలు 13వ అధ్యాయం నుండి ప్రారంభమౌతుంది. ఇక్కడ పేర్కొన్న సంఘటనంతో ప్రారంభించి పౌలు చాల గ్రీకు పట్టణాల్లో క్రైస్తవ సమాజాలు స్థాపించాడు. యూదులుకాని అన్యజాతి ప్రజలను ఎందరినో క్రైస్తవ మతంలోకి తీసికొనివచ్చాడు.

3. మనం ఏ వుద్యమాన్ని ప్రారంభించినా ప్రార్ధనతో, పవిత్ర భావాలతో ప్రారంభించాలి. ఆత్మనుండి ప్రేరణం పొంది మరీ ప్రారంభించాలి. ఈలా ప్రారంభించిన కార్యక్రమాలు పై పౌలు వేదబోధలాగే సత్ఫలితాన్నిస్తాయి. ఈలా కాకుండ కేవలం మానవ ప్రయత్నంతో, స్వార్ధప్రయోజనాల కొరకు ప్రారంభించిన వుద్యమాలు మంచి ఫలితాలు ఈయవు. అసలు అవి నిలవ్వు

5. ఎఫెసు పెద్దలు అ.చ. - 20, 36–38.

1. పూర్వాంశంలో పౌలు అన్యజాతులకు వేదబోధను ఏలా ప్రారంభించాడో చూచాం, ప్రస్తుతాంశంలో ఆ వేదబోధ ఏలా ముగిసిందో చూస్తాం. పౌలు గ్రీకు రోమను ప్రజలకు మూడేండ్లపాటు వేదబోద చేస్తూ మూడు ప్రేషిత ప్రయాణాలుచేసాడు. ఆయా పట్టణాల్లో క్రైస్తవసమాజాలను నెలకొల్పాడు. అవే తొలినాటి తిరుసభలు. మూడవదీ చివరిదీ ఐన ప్రయాణంలో అతడు మిలేతు నగరానికి వచ్చాడు. ఎఫెసు సంఘ పెద్దలను అచటికి పిలిపించాడు. వారికి తన చివరి సందేశాన్ని విన్పించాడు. పౌలు మిలేతునుండి యెరూషలేముకి వెళ్తాడు. అక్కడ యూదులు అతన్ని బందీనిచేసి రోముకి పంపుతారు. పౌలు రోములో చెరలో కన్నుమూస్తాడు. కనుక అతడు ఇక వేదబోధ చేసేదీలేదు, క్రైస్తవ సమాజాలను నెలకొల్పేదీలేదు. కనుక పౌలు ఎఫెసు పెద్దలను మళ్లా కంటితో చూడడు.